500 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో దేవర తాండవం.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకున్నది సాధించారుగా!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )నటించిన దేవర రిలీజ్ రోజున ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది.

ఎన్టీఆర్ ను టార్గెట్ చేయడం వల్లో లేక కొరటాలపై కోపంతోనో కొంతమంది ఈ సినిమాకు విపరీతంగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు.

ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సైతం దేవర రిజల్ట్ విషయంలో టెన్షన్ పడ్డారు.అయితే బెనిఫిట్ షోలు ప్రదర్శించబడటంతో పాటు టికెట్ రేట్ల పెంపు దేవర సినిమాకు ఎంతో ప్లస్ అయింది.

Devara Movie 500 Crores Gross Collections Details Inside Goes Viral In Social Me

దేవర సినిమా( Devara movie) మాస్ సినిమా అయినప్పటికీ 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించాలని అభిమానులు కోరుకోగా ఆ కోరిక ఎట్టకేలకు నెరవేరింది.500 కోట్ల రూపాయల భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దేవర తాండవం మామూలుగా లేదు.ఈరోజు కూడా హైదరాబాద్ లోని చాలా థియేటర్లలో దేవర బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకున్న భారీ విజయం ఈ సినిమాతో దక్కింది.

Devara Movie 500 Crores Gross Collections Details Inside Goes Viral In Social Me
Advertisement
Devara Movie 500 Crores Gross Collections Details Inside Goes Viral In Social Me

రాజమౌళి శాపాన్ని ఎవరూ బ్రేక్ చేయలేరంటూ కామెంట్లు వినిపించగా ఈ సినిమాతో ఆ సెంటిమెంట్ సైతం బ్రేక్ అయిందనే చెప్పాలి.దేవర మూవీ కలెక్షన్ల విషయంలో నిర్మాతలు పూర్తిస్థాయిలో సంతృప్తితో అయితే ఉన్నారు.ఈ సినిమా ఇప్పటికే బిజినెస్ తో పోల్చి చూస్తే 40 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం లాభాలను సొంతం చేసుకోవడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

నాగవంశీ డిస్ట్రిబ్యూటర్( Naga Vamsi ) గా వ్యవహరించడం ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ అయిందని చెప్పవచ్చు.భవిష్యత్తులో ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో సినిమా తెరకెక్కనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.దేవర ఫుల్ రన్ కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండనున్నాయో చూడాలి.

పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?
Advertisement

తాజా వార్తలు