2లో దీప్తి సునైన 3లో శివజ్యోతి ఇప్పుడు హారిక

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 లో దీప్తి సునయన జుట్టు కత్తిరించుంది.

ఎలిమినేషన్‌ నామినేషన్‌ పక్రియలో భాగంగా ఒకరిని సేవ్ చేసేందుకుగాను ఆమె జుట్టు కట్ చేసుకుంది.

ఇక బిగ్ బాస్ సీజన్ 3లో శివ జ్యోతి అలియాస్ జ్యోతక్క కూడా జుట్టు కట్ చేసుకుంది.ఆమె కూడా ఎలిమినేషన్‌ పక్రియలో భాగంగా ఒకరిని సేవ్‌ చేసేందుకు గాను జుట్టు కట్ చేసుకుంది.

Dethadi Harika Hair Cut For Bigg Boss This Week Task Big Boss 4, Nagarjuna, Deep

వీరిద్దరికి మంచి పేరు రావడంతో పాటు ఆ ఎపిసోడ్లకు మంచి రెస్పాన్స్‌ కూడా వచ్చింది.అయితే ఈసారి కాస్త విభిన్నంగా జుట్టు కట్టింగ్‌ సీన్‌ పెట్టినట్లుగా నేటి ఎపిసోడ్‌ ప్రోమో చూస్తుంటే అనిపిస్తుంది.

జుట్టు కట్‌ చేసే సీన్లకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సారి కూడా బిగ్‌ బాస్‌ టీం ఒకరికి జుట్టు కట్ చేయడానికి సిద్దం అయ్యారు.నేడు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ లో దేత్తడి హారిక కు జుట్టు కట్ చేయబోతుంది.

Advertisement

ఈ వారం బిగ్‌ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా దేత్తడి హారిక తన జుట్టు కత్తిరించుకోవాల్సి వచ్చింది.ఇంటి సభ్యులు అందరూ కూడా ఆమెను వద్దన్నట్లుగా చూపించినా చివరకు ఆమె ఏడ్చుకుంటూ జుట్టు కట్ చేయడం ప్రోమో లో చూడవచ్చు.

జుట్టు కట్‌ చేసుకోవాలి అనగానే అన్నయ్య జుట్టు కట్‌ చేసుకోవడం వంటివి చేస్తే బాగోదు అంటూ హెచ్చరించాడు అంటూ వెనక్కు తగ్గింది.కాని ఏం జరిగిందో ఏమో కాని చివరకు కట్టింగ్‌ కు సిద్దం అయ్యింది.

అన్నయ్య నీ ప్రామీస్‌ ను నిలుపుకోలేక పోయాను అంటూ హారిక ఏడ్వడంతో నేటి ఎపిసోడ్‌ పై ఆసక్తి నెలకొంది.నేటి ఎపిసోడ్‌ లో కుమార్‌ సాయి తన ఒంటిపై ఉన్న డ్రెస్ చివరకు డ్రాయర్‌ తో సహా కట్‌ చేశాడు.

మొత్తానికి నేటి ఎపిసోడ్‌ లో బిగ్‌ బాస్‌ తన శాడిజంను బాగానే చూపించినట్లుగా అనిపిస్తుంది.ఇంకా ఎంత మందిని ఏం చేయమని బిగ్‌ బాస్‌ అన్నాడో తెలియాలంటే నేడు ఎపిసోడ్‌ చూడాల్సిందే.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు