మొదటి రోజే ఐఏఎస్ ఆఫీసర్ లకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నేడు బాధ్యతలు స్వీకరించారు.

బుధవారం ఉదయం విజయవాడ( Vijayawada )లో డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ లో బాధ్యతలు చేపట్టడం జరిగింది.

ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరు చేస్తూ తొలి సంతకం చేయడం జరిగింది.అనంతరం మధ్యాహ్నం ఐఏఎస్ ఆఫీసర్లతో డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ లో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

గ్రామాలలో మౌలిక వసతులు, రోడ్ల నిర్మాణం, మంచినీటి ఎద్దడి అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు.ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసి పనులు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.మూడు నెలల తర్వాత పనుల పురోగతిపై సమీక్షిస్తానని అధికారులకు చెప్పటం జరిగింది.

Advertisement

ఇదే సమయంలో ప్రజా సమస్యల విషయంలో ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యం వహించొద్దని హెచ్చరించారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పిఠాపురం నుండి విజయం సాధించిన పవన్ కళ్యాణ్.

చంద్రబాబు( CM chandrababu naidu ) ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి దక్కించుకున్నారు.ఉప ముఖ్యమంత్రిగా నేడు బాధ్యతలు స్వీకరించడం జరిగింది.

పదవి చేపట్టిన అనంతరం మొదటి రోజే ఉన్నతాధికారులతో సమావేశమై తన శాఖకు సంబంధించిన పనులపై సమీక్షించి పలు ఆదేశాలు ఇవ్వటం సంచలనంగా మారింది.

ఈ ఏడాది చివరికి ప్రభాస్ పెళ్లి... సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు లక్ష్మి?
Advertisement

తాజా వార్తలు