రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్( Vladimir Putin ) ఉత్తర కొరియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.24 సంవత్సరాల తర్వాత పుతిన్ ఉత్తర కొరియాలో పర్యటించడంతో.ఈ పర్యటన అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.కాగా ఉక్రెయిన్ పై యుద్ధంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్.పుతిన్ కి మద్దతు ప్రకటించడం తెలిసిందే.ఈ నేపథ్యంలో పుతిన్ తాజా పర్యటనలో ఇరు దేశాలు సహకరించుకునేలా కిమ్ ఒప్పందం చేసుకున్నారు.
రష్యాకు ఆపద వస్తే ఉత్తర కొరియా, కిమ్ ( Kim Jong Un )కు ఆపద వస్తే రష్యా ఆదుకునేలా ఈ ఒప్పందం జరిగింది.దురాక్రమణ సమయాల్లో పరస్పర సహకారం అందించుకోవాలని అధినేతలు నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు పలు ఒప్పందలపై బుధవారం సంతకాలు చేసినట్టు రష్యా వార్తా సంస్థ టిఏఎస్ఎస్ పేర్కొంది.ఇదే సమయంలో ఇరు దేశాధీనేతలు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు.ఆర్థిక సైనిక సహకార పరిధిని మరింత పెంచుకోవాలని కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.మరి ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా( America )కు వ్యతిరేకంగా ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించుకున్నట్లు వార్తలు రావడం జరిగాయి.
ఈ మేరకు వ్యూహాత్మక భాగస్వామ్యంపై సంతకాలు చేయడం జరిగిందట.కాగా ఈ పర్యటనలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ కు రష్యా కు చెందిన ఔరాస్ లగ్జరీ కారును పుతిన్ బహుమతిగా ఇవ్వటం జరిగింది.
దీంతో పుతిన్ ఉత్తరకొరియాతో చేసుకున్న ఒప్పందాలు అంతర్జాతీయ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.