చిక్కుల్లో కమలా హారిస్ రన్నింగ్‌మెట్ టిమ్ వాల్జ్.. నిధుల దుర్వినియోగం ఆరోపణలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరపున అభ్యర్ధిగా నిలిచిన కమలా హారిస్( Kamala Harris ) తన రన్నింగ్ మెట్‌ (ఉపాధ్యక్ష అభ్యర్ధి)గా మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్‌ను( Minnesota Governor Tim Wal ) ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే.

దీంతో వారిద్దరూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

అయితే టిమ్ వాల్జ్‌ను రిపబ్లికన్లు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో టిమ్ వాల్జ్ ఓ వివాదంలో చిక్కుకున్నారు.

హౌస్ ఎడ్యుకేషన్ అండ్ వర్క్‌ఫోర్స్ కమిటీ వాల్జ్‌కు సబ్‌పోనా జారీ చేసింది.చిన్నారులకు ఆహారం అందజేసేందుకు ఉద్దేశించిన పాండమిక్ రిలీఫ్ నిధులను గవర్నర్ హోదాలో టిమ్ వాల్జ్ దుర్వినియోగం చేసినట్లుగా కమిటీ అభిప్రాయపడింది.

ఈ పథకానికి సంబంధించిన పత్రాలు, కమ్యూనికేషన్‌లను తమకు సమర్పించాల్సిందిగా సూచించింది.హౌస్ కమిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ వర్క్‌ఫోర్స్ రిపబ్లికన్ అధ్యక్షురాలు వర్జీనియా ఫాక్స్ సబ్‌పోనెడ్( Virginia Fox subpoenaed ) లేఖను పంపారు.

Advertisement

వాల్జ్ పర్యవేక్షణలో రీయింబర్స్‌మెంట్ ఇవ్వడానికి ఫీడింగ్ అవర్ ఫ్యూచర్ పథకంలో నకిలీ పిల్లల పేరును సృష్టించారని హౌస్ కమిటీ ఆరోపించింది.మీరు గవర్నర్‌గా ఉన్న హయాంలో జరిగిన కోట్లాది డాలర్ల ఫ్రాడ్ గురించి మీకు బాగా తెలుసు, గతంలో పత్రాల కోసం మిన్నెసోటా విద్యాశాఖను కమిటీ పలుమార్లు కోరిందని ఫాక్స్ పేర్కొంది.

దీనిపై వాల్జ్ ప్రచార ప్రతినిధి మాట్లాడుతూ.మోసాన్ని అడ్డుకోవడానికి రాష్ట్ర విద్యాశాఖ శ్రద్ధగా పనిచేసిందన్నారు.ఈ ఫ్రాడ్‌లో పాల్గొన్న వ్యక్తులను అరెస్ట్ చేయడానికి , ఛార్జ్ చేయడానికి విద్యా శాఖతో కలిసి పనిచేసినందుకు తాము ఎఫ్‌బీఐకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

సబ్‌పోనాలపై ఎన్‌బీసీ న్యూస్ మొదట నివేదించింది.వీటిని మిన్నెసోటా విద్యా కమీషనర్ విల్లీ జెట్, యూఎస్ అగ్రికల్చర్ సెక్రటరీ టామ్ విల్సాక్( Willie Jett, US Secretary of Agriculture Tom Vilsack ), అగ్రికల్చర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఫిల్లిస్ ఫాంగ్‌లతో సహా ఇతర అధికారులకు కూడా పంపారు.

ఫెడరల్ చైల్డ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్‌లకు సంబంధించి యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (యూఎస్‌డీఏ), మిన్నెసోటా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పర్యవేక్షణపై యూఎస్ కమిటీ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ ది వర్క్‌ఫోర్స్ దర్యాప్తు చేసింది.ఫీడింగ్ అవర్ ఫ్యూచర్ స్కీమ్ కోసం పాండమిక్ రిలీఫ్ ఫండ్స్ నుంచి 250 మిలియన్ డాలర్లకు పైగా నిధులను దుర్వినియోగం అయినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు