ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ లేనివిధంగా మంత్రుల వ్యవహారం ఉంది.చెప్పుకోవడానికి మంత్రులు తప్ప, తమ శాఖపై తాము ఏ విషయంపైనా మాట్లాడాల్సిన పని లేకుండా వేరే శాఖ మంత్రులు తమ శాఖల గురించి మాట్లాడడం, ఏ విషయం పైన వారే స్పందిస్తూ వస్తుండడం వంటి వ్యవహారాలతో కొంతమంది మంత్రులు పేరుకే తప్ప వారి వల్ల ఉపయోగం లేదు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏపీలో మెజార్టీ మంత్రులు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు అనే విషయం ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా ఉంది.అప్పుడప్పుడు తమ శాఖలకు సంబంధించిన విషయాలపై స్పందించడం తప్పితే, మిగతా విషయాల్లో వేరే మంత్రులు పెత్తనం చేస్తున్నట్లు గా వ్యవహరించడం, ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే ఏ విషయం పైన అయినా స్పందిస్తూ వస్తుండడం.
కొంతమంది మంత్రులకు తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది.
కొడాలి నాని, పేర్ని నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , అనిల్ కుమార్ యాదవ్, బొత్స సత్యనారాయణ వంటి వారు మాత్రమే ఇతర శాఖలకు సంబంధించిన విషయాలపైనా స్పందిస్తూ ఉంటారు.
రాజకీయంగా వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు వచ్చినా కౌంటర్ ఇచ్చేందుకు వీరే ముందు ఉంటూ వస్తున్నారు.హోంశాఖ పై ఏవైన ఆరోపణలు వచ్చినా, మిగతా మంత్రులలో సజ్జల రామకృష్ణా రెడ్డి వంటి వారు స్పందిస్తున్నారు.
హోంమంత్రిగా సుచరిత ఉన్న మౌనంగానే ఉండిపోతున్నారు.
ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసినా, వివిధ శాఖల పైన ఆరోపణలు చేసినా, సంబంధిత మంత్రి స్పందించేందుకు అవకాశం లేకుండా పోవడం తదితర అంశాలపై చర్చ జరుగుతోంది.త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉన్న నేపథ్యంలో కొంతమంది మంత్రులు మౌనంగా ఉండి పోతుండగా, అధిష్టానం నుంచి ఈ మేరకు సూచనలు ఉండడం, ఏ విషయం పైన స్పందించేందుకు అవకాశం లేకుండా ఎప్పటికప్పుడు ఆదేశాలు వస్తుండడంతో , ఎవరికి వారు సైలెంట్ గానే ఉండి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.వాస్తవంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఊహించని వారు ఎందరో మంత్రి పదవులు దక్కించుకున్నారు జగన్ తన సన్నిహితులను సైతం పక్కనపెట్టి మరీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
కానీ వారంతా పేరుకే తప్ప రాజకీయంగా నోరు విప్పలేని పరిస్థితి ఉంది.