శ్రీచైతన్య కళాశాల గుర్తింపును రద్దు చేయాలి:బీసీ విద్యార్థి సంఘం

సూర్యాపేట జిల్లా: హైదరాబాద్ నర్సింగ్ లోని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి సాత్విక్ మృతికి కారణమైన శ్రీ చైతన్య కళాశాలను రద్దు చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్క వెంకట్ యాదవ్ డిమాండ్ చేశారు.

బుధవారం జిల్లా కేంద్రంలో అయన మీడియాతో మాట్లాడుతూ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని,విద్యార్థి కుటుంబానికి కళాశాల యజమాన్యం కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలన్నారు.

ఫీజు నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలన్నారు.మృతిని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని,ఇలాంటి కార్పొరేట్ కళాశాలపై ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తుందన్నారు.

కార్పొరేట్ సంస్థల పేరుతో పిల్లల జీవితాలతో చలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.ఈ మధ్యకాలంలో కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నాయని,వీటిపై ప్రభుత్వం నియంత్రణ చేపడతలేదన్నారు.

ఇప్పటికైనా కార్పోరేట్ సంస్థలపై ప్రభుత్వం నిఘా పెంచాలని,దీనికి బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు.ఈ కార్యక్రమంలో వెంకటేష్, బాలాజీ,సంతోష్,దత్తు పాల్గొన్నారు.

Advertisement
డ్రై ఫ్రూట్స్ తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తాజా వార్తలు