అల్లు అర్జున్ కు విషెస్ చెప్పిన డేవిడ్ వార్నర్ కుమార్తె.. వీడియో వైరల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు 41వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లు వెత్తుతున్నాయి.

అభిమానులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం పుష్పరాజ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) సైతం ఈయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఈయన కుమార్తెతో కూడా అల్లు అర్జున్(Allu Arjun) కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పుష్ప సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమాలోని డైలాగులు అల్లు అర్జున్ సిగ్నేచర్ మూమెంట్స్ ఎంతగా ఫేమస్ అయ్యాయో మనకు తెలిసిందే.అయితే ఈ సినిమాలోని పాటలకు డేవిడ్ వార్నర్ తనదైన స్టైల్ లో రీల్స్ చేసిన విషయం మనకు తెలిసిందే.అయితే నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.

బిగ్ షాట్ అవుట్.బిగ్ మ్యాన్ అల్లు అర్జున్ కు హ్యాపీ బర్త్ డే పుష్ప 2 సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం ఈ పుట్టినరోజు నీకు చాలా గొప్పగా ఉండాలి అని తనకు శుభాకాంక్షలు తెలియజేస్తూనే తన కుమార్తె ఐలాని పిలిచాడు.

Advertisement

ఈ విధంగా డేవిడ్ వార్నర్ పిలవగానే వచ్చిన ఐలా హ్యాపీ బర్త్ డే పుష్ప(Happy Birthday Pushpa) అంటూ ఎంతో ముద్దుగా క్యూట్గా అల్లు అర్జున్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక నేడు అల్లు అర్జున్ కు వచ్చిన పుట్టినరోజు శుభాకాంక్షలు డేవిడ్ వార్నర్ కుమార్తె తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడమే ది బెస్ట్ విషెస్ అవుతుంది అంటూ అభిమానులు భావిస్తున్నారు.

అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?
Advertisement

తాజా వార్తలు