వన్డే క్రికెట్ చరిత్రలో డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి అందరికీ తెలిసిందే.ప్రపంచ క్రికెట్ లో బెస్ట్ బ్యాట్స్‌మెన్స్ గా పేరు తెచ్చుకున్నాడు.

 David Warner Creates A Record By Getting Stumps Out At 99 Runs Vs Sri Lanka Details, One Day Match, David Warner, New Record, Sports Update, Sports Team, Record, Latest News, David Warner 99 Runs, David Warner Stumps Out, Aus Vs Sri Lanka Odi Series-TeluguStop.com

డేవిడ్ వార్నర్ గ్రౌండ్ లో ఉన్నాడంటే పరుగుల వరద పారాల్సిందే.క్రీజులో ఉన్నంతసేపు తన బ్యాట్ తో చెలరేగిపోతూ ఉంటాడు.

దీంతో వార్నర్ బ్యాటింగ్ లో ఉన్నంతసేపు ప్రత్యర్ధి జట్లకు ఇబ్బందిగా ఉంటుంది.ఏ బాల్ ఎటువైపు కొడతాడో కూడా తెలియదు.

 David Warner Creates A Record By Getting Stumps Out At 99 Runs Vs Sri Lanka Details, One Day Match, David Warner, New Record, Sports Update, Sports Team, Record, Latest News, David Warner 99 Runs, David Warner Stumps Out, Aus Vs Sri Lanka Odi Series-వన్డే క్రికెట్ చరిత్రలో డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తన స్మార్ట్ బ్యాటింగ్ తో డేవిడ్ బాయ్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.

గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా కూడా పనిచేశాడు.

ఐపీఎల్ లో కూడా డేవిడ్ వార్నర్ పేరిట అనేక రికార్డులు ఉన్నాయి.ఫాస్ట్ గా పరుగులు చేసే ఆగటాళ్లలో డేవిడ్ వార్నర్ ఉంటాడు.

ఇటీవల జరిగిన ఐపీఎల్ లో కూడా తన బ్యాటింగ్ తో వార్నర్ అలరించాడు.బ్యాటింగ్ తోనే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో తన వీడియోలతో వార్నర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడు.

తెలుగు సినిమా పాటలను రీల్స్ లా చేస్తూ అలరిస్తూనే ఉంటాడు.

అయితే తాజాగా డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు సృష్టించాడు.

వన్డే క్రికెట్ చరిత్రలో 99 పరుగుల వద్ద స్టంప్ ఔట్ అయిన రెండో ఆటగాడిగా నిలిచాడు.శ్రీలంకతో మంగళవారం జరిగిన వన్డే మ్యాచ్ లో డేవిడ్ వార్న్ ఈ రికార్డు నెలకొల్పాడు.12 బంతుల్లో 12 ఫోర్లతో చెలరేగిన డేవిడ్ వార్నర్ 99 పరుగుల వద్ద ధనంజయ డిసిల్వ బౌలింగ్ లో స్టంప్ ఔట్ అయ్యాడు.

38వ ఓవర్ లో రెండో బౌలా్ ను క్రీజ్ బయటకు వచ్చి డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు.అయితే బాల్ వికెట్ కీపర్ నిరోషన్ డిక్ మెల్లా చేతుల్లోకి వెళ్లడంతో వార్నర్ ను స్టంప్ ఔట్ చేశాడు.

ఒక రన్ తో డేవిడ్ వార్నర్ సెంచరీ మిస్ చేసుకోవడంతో ఆస్ట్రేలియా టీమ్ నిరాశకు గురైంది.2002లో నాగ్ పూర్ లో వెస్డిండీస్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ 99 పరుగుల వద్ద స్టంప్ ఔట్ అయి సెంచరీ మిస్ అయ్యాడు.ఆ తర్వాత 99 పరుగుల వద్ద స్టంప్ ఔట్ అయిన రెండో ఆటగాడు డేవిడ్ వార్నర్ కావడం గమనార్హం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube