దసరా త్రిముఖ పోటీతో ఎవరికి నష్టం?

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న దసరా సినిమాలు మరి కొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.

ఈ దసరాకి బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

ఇక రవితేజ హీరో గా నటించిన బయో పిక్ మూవీ టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao )సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక తమిళ్‌ స్టార్‌ హీరో విజయ్‌ లియో సినిమా( Leo movie ) ను కూడా రేపే విడుదల చేయబోతున్నారు.

కోర్టు కేసు నేపథ్యం లో సినిమా విడుదల విషయం లో అనుమానం వ్యక్తం అవుతోంది.ఒక వేళ సినిమా కనుక విడుదల అయితే కచ్చితంగా రికార్డుల మోత మ్రోగించడం ఖాయం.

ప్రస్తుతం సినిమా కు సంబంధించిన లీగల్ ఇష్యూ పై చర్చ జరుగుతోంది.అయితే బాలయ్య మరియు రవితేజ లు మాత్రం ప్రమోషన్స్‌ తో కుమ్మస్తున్నారు.

Advertisement

రికార్డు ల వర్షం కురిపించేందుకు గాను బాలయ్య భారీ ప్లాన్స్ చేస్తున్నాడు.

ఈ దసరా కి త్రిముఖ పోటీ వల్ల కచ్చితంగా అందరికి నష్టం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.స్టార్‌ హీరోల సినిమా లు మొదటి రోజు చూడాలి అనే ఆసక్తిని కనబర్చే వారు చాలా మంది ఉంటారు.అయితే దసరా కి మూడు సినిమా లు వస్తే కచ్చితంగా అది కలెక్షన్స్ విషయం లో అందరికి నష్టం కలిగిస్తుంది అంటూ బాక్సాఫీస్‌ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

లియో కి ఎక్కువ డ్యామేజీ ఉంటుంది.భగవంత్‌ కేసరి( Bhagwant Kesari ) మరియు టైగర్‌ నాగేశ్వర రావు సినిమా లు మాత్రం మొదటి రోజు నువ్వా నేనా అన్నట్లుగా వసూళ్లు రాబడుతాయి.

కానీ రెండో రోజు మాత్రం టాక్‌ ని బట్టి వసూళ్లు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.మొత్తానికి టైగర్‌ నాగేశ్వరరావు మరియు భగవంత్‌ కేసరి మధ్య పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

లియో సినిమా కి మాత్రం తెలుగు బాక్సాఫీస్ వద్ద ఎంత వరకు సందడి కనిపిస్తుంది అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు