తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 6, శనివారం2024

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.07

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.31

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: ఉ.10.35 ల11.30

Advertisement
Daily Astrology Prediction Telugu Rasi Phalalu April 06 Saturday 2024, Daily Ast

దుర్ముహూర్తం: ఉ.6.30 ల7.36

మేషం:

Daily Astrology Prediction Telugu Rasi Phalalu April 06 Saturday 2024, Daily Ast

ఈరోజు కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.భాగస్వామ్య వ్యాపారాలు మరింత అనుకూల పరిస్థితులుంటాయి.ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

రక్తపు మరకల దుస్తులతోనే తండ్రికి కూతురు అంత్యక్రియలు.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటలు విని ఎంతో సంతోషించాను.. నాగచైతన్య కామెంట్స్ వైరల్!

వృషభం:

Daily Astrology Prediction Telugu Rasi Phalalu April 06 Saturday 2024, Daily Ast
Advertisement

ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు.వృత్తి వ్యాపారాలలో భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు.సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

కుటుంబ పెద్దల సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా మేలైన ఫలితాలుంటాయి.

ఉద్యోగమున నూతన అవకాశములు అందుతాయి.

మిథునం:

ఈరోజు ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు తీసుకొని చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.ఇతరులతో ఉన్న వివాదాల నుండి బయట పడతారు.వృత్తి ఉద్యోగాల్లో అధికారుల అభిమానాలు పొందుతారు.

నిరుద్యోగులు లభించిన అవకాశాన్ని జారవిడువకుండా చూసుకోవాలి.సంఘంలో గౌరవ మర్యాదలు లోటు ఉండదు.

కర్కాటకం:

ఈరోజు ఋణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.చాలాకాలంగా వేధిస్తున్న ఋణ సమస్యలు నుండి బయటపడతారు.చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ విజయవంతంగా పూర్తి చేస్తారు.

వ్యాపార ఉద్యోగాలలో ఆర్ధిక లబ్ది పొందుతారు.మానసిక ప్రశాంతత పొందుతారు.

సింహం:

ఈరోజు ఆర్థిక పరిస్థితిలో ఆకస్మిక మార్పులు కలుగుతాయి.రుణయత్నాలు నిరాశ కలిగిస్తాయి.చేపట్టిన పనులు వాయిదా పడుతాయి.

విద్యార్థులకు కొంత సామాన్యంగా ఉంటుంది.వ్యాపారములలో ఆలోచనలు అంతగా కలసిరావు.

వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి.ఖర్చులు అదుపులో ఉంచడం మంచిది.

కన్య:

ఈరోజు ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు.

సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి.వృత్తి, వ్యాపారాలలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.

నిరుద్యోగులకు ఒక వార్త ఆనందం కలిగిస్తుంది.

తుల:

ఈరోజు ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత కలుగుతుంది.ఉదర సంభందిత అనారోగ్య సూచనలున్నవి.

కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు ఉంటాయి.వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

ఖర్చులు పెరుగుతాయి.

వృశ్చికం:

ఈరోజు వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి.మిత్రులతో వివాదాలు పరిష్కారమౌతాయి.

కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది.ఆకస్మిక ధనప్రాప్తి లభిస్తుంది.

ఋణ సమస్యల నుండి బయట పడతారు.

ధనుస్సు:

ఈరోజు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు.వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు చేసి లాభపడతారు.అన్ని వైపుల నుండి మంచి జరుగుతుంది.

ఆదాయ మార్గాలు పెరుగుతాయి.నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

ఉద్యోగస్తులకు అధికారుల అండదండలు లభిస్తాయి.

మకరం:

ఈరోజు సంతాన ఆరోగ్య సమస్యలు మానసికంగా బాధిస్తాయి.వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం లేని ఆలోచనలు చేసి నష్టపోతారు.ఇతరులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి.

ఉద్యోగమున విలువైన పత్రాలు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.ఖర్చులు అదుపు చేయడం కష్టంగా ఉంటుంది.

కుంభం:

ఈరోజు ధనదాయం పెరుగుతుంది.చేపట్టిన పనుల్లో ఆకస్మిక విజయం పొందుతారు.స్ధిరాస్తి వివాదాలు నుండి బయట పడతారు.

బంధు మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

మీనం:

ఈరోజు జీవిత భాగస్వామి నుండి ఊహించని సహాయం అందుతుంది.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది.

బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.వృత్తి వ్యాపారాలలో ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి.

తాజా వార్తలు