ఇప్పుడు పురంధరేశ్వరి హ్యాపేనా ?

ఎట్టకేలకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి( Daggubati Purandeswari ) కృషి ఫలించినట్టుగానే కనిపిస్తుంది.

టిడిపి తో పొత్తు విషయంలో బహిరంగంగా ఆమె ఏ ప్రకటన చేయనప్పటికీ, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మంచిదనే అభిప్రాయంతోనే ఉంటూ వచ్చారు.

ఏపీలో బిజెపిని బలోపేతం చేయడంతో పాటు, టిడిపి కి చెందిన కీలక నేతలు, కమ్మ సామాజిక వర్గం ప్రముఖులను బిజెపిలో చేర్చడమే లక్ష్యంగా పురందరేశ్వరికి బీజేపీ అధిష్టానం ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని కట్టబెట్టింది.అయితే ఆమె ఆ విషయాలపై ఫోకస్ పెట్టకుండా, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు ఆమెపై ఎన్నో అధిష్టానానికి వెళ్లాయి.

ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు అయిన వ్యవహారం తర్వాత, పురందరేశ్వరి వ్యవహరించిన తీరుపై బీజేపీ నేతల్లోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది.చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్ర బిజెపి పెద్దలు మౌనంగానే ఉన్నా.

అక్కడ నుంచి దీనిపై ఏ స్పందన రాకపోయినా, పురందరేశ్వరి మాత్రం చంద్రబాబు అరెస్టును ఖండించడమే కాకుండా, నారా లోకేష్( Nara Lokesh ) ను వెంటబెట్టుకుని అమిత్ షా తో బేటి కావడం టిడిపికి అనుకూలంగా ఏపీలో ప్రకటనలు చేయడం వంటివి చోటుచేసుకున్నాయి.

Advertisement

ఏపీలో ఎన్నికలకు కేవలం కొద్ది నెలలు మాత్రమే ఉన్న నేపథ్యంలో, పొత్తులపై బీజేపీ అధిష్టానం కూడా ఆలోచనలో పడింది. టిడిపి, జనసేన ఇప్పటికే పొత్తులు పెట్టుకున్నాయి.తమతో కలిసి ముందుకు వచ్చేందుకు పవన్ ఇష్టపడే అవకాశం కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలోనే టిడిపి తో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందేమో అన్న అభిప్రాయంలో కేంద్ర బిజెపి పెద్దలు ఉన్నారు.టిడిపి తనకు తానుగా బిజెపి పెద్దలను కలిసి పొత్తు ప్రతిపాదన చేస్తే అప్పుడు పొత్తుకు మొగ్గు చూపాలని బిజెపి భావిస్తుంది.

ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదని పరోక్షంగా టిడిపి పై సెటైర్లు వేశారు ఆ పార్టీ కీలక నేత సత్యకుమార్( Satykumar )నిన్న విజయవాడలో బిజెపి సీనియర్ నేతలు ఇంత సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించారు.

బుధవారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో నలభై మంది నేతలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా టిడిపి తో పొత్తు పెట్టుకుంటే మంచిదనే అభిప్రాయాన్ని చాలామంది నేతలు వ్యక్తం చేశారు.ఈ పరిణామాలన్నిటినీ పరిశీలిస్తే బిజెపి కూడా టిడిపి ,జనసేన కూటమితో కలిసి అడుగులు వేసే విధంగా కనిపిస్తోంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

ముందు నుంచి పురందరేశ్వరి కోరుకుంటున్నట్లుగానే జరగబోతున్నట్లుగా ప్రస్తుత పరిస్థితి చూస్తే అర్ధం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు