సైబర్ నేరగాళ్ల కొత్త తరహా మోసం.. ఓటీపీ, మెసేజ్ లు రాకుండానే అకౌంట్ లో సొమ్ము స్వాహా..!

టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న క్రమంలో.

సైబర్ నేరగాళ్లు కూడా మోసాలు చేయడానికి కొత్త కొత్త మార్గాలను అన్వేషించి సులువుగా అకౌంట్లలో ఉండే డబ్బును( Money ) స్వాహా చేస్తున్నారు.

గతంలో అయితే లాటరీలు, గిఫ్ట్ ల పేరుతో అకౌంట్ వివరాలు సేకరించి డబ్బు కాజేసేవారు.తరువాత కాస్త రూట్ మార్చి ఓటీపీ, మెసేజ్లు పంపించి చాకచక్యంగా డబ్బులు కాజేసేవారు.

కానీ అకౌంట్లో సొమ్మును స్వాహా చేయడానికి మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది.దీంతో ఓటీపీ, మెసేజ్ లు లేకుండా డబ్బులు దోచేస్తున్నారు.

అది ఎలాగంటే ఆధార్ బయోమెట్రిక్ తో( Aadhar Biometric ) ఖాతాదారుల ప్రమేయం లేకుండానే లక్షలకు లక్షలు కొట్టేయొచ్చు.గత మూడున్నర నెలల కాలంలో 150 అకౌంట్లో నుంచి 45 లక్షల రూపాయలను ఖాతాదారుల ప్రమేయం లేకుండా కేవలం ఆధార్ బయోమెట్రిక్ తో కొట్టేశారు.

Advertisement

ఈ కొత్త తరహా మోసంతో బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు.పోలీసుల విచారణలో బాధితులంతా ఎక్కడో ఒక చోట బయోమెట్రిక్ వేసిన వాళ్లే.ఉదాహరణకు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ల వద్ద బయోమెట్రిక్ డేటా( Biometric Data ) లీక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందని పోలీసులు తెలిపారు.

ఖాతాదారుల బయోమెట్రిక్ సేకరించి చాలా సులువుగా అకౌంట్ లో నుంచి డబ్బులు స్వాహా చేసేస్తున్నారు.ఆ సమయంలో ఖాతాదారులకు ఓటీపీ ( OTP ) రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

దీంతో పబ్లిక్ కు తెలియకుండానే డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తోంది.

ఈ కొత్త తరహా మోసానికి బలి కాకూడదంటే బయోమెట్రిక్ లాక్ చేసుకోవడం చాలా ఉత్తమం అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.అంటే ఆధార్ నెంబర్ ను లాక్ చేయడానికి, అన్ లాక్ చేయడానికి యూఐడీఏఐ ఓ సరికొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది.UIDAI వెబ్ సైట్ ద్వారా లేదా ఎస్ఎంఎస్ సర్వీస్ ద్వారా 16 అంకెల వర్చువల్ ఐడీ నెంబర్ ను క్రియేట్ చేసుకోవాలి.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
ప్రభాస్, బన్నీ, తారక్ సాధించారు.. చరణ్ గేమ్ ఛేంజర్ తో లెక్కలు తేలుస్తారా?

ఆ తర్వాత అధికారిక వెబ్సైట్లో ఆధార్ సేవలపై క్లిక్ చేసి, లాక్/ అన్ లాక్ బయోమెట్రిక్లను సెలెక్ట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయాలి.

Advertisement

సెండ్ ఓటీపీ విత్ క్యాప్చా కోడ్ పై క్లిక్ చేయాలి.తర్వాత రిజిస్టర్ మొబైల్ కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.

ఓటీపీ ఎంటర్ చేశాక స్క్రీన్ పై ఎనేబుల్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే బయోమెట్రిక్ లాక్ అవుతుంది.

తాజా వార్తలు