చదివింది పదో తరగతి... 31 బ్యాంకులకు టోకరా...!

హైదరాబాద్ పోలీసులు డెబిట్, క్రెడిట్ కార్డులను క్లోనింగ్ చేసి మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు.

ప్రధాన నిందితునితో పాటు అతనికి సహకరిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

పోలీసులు నిందితుల దగ్గర నుండి 10 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.డీసీపీ రోహిణీ ప్రియదర్శిని మీడియాతో మాట్లాడుతూ నిందితులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

గచ్చిబౌలి హెచ్.ఢీ.ఎఫ్.సీ బ్యాంక్ మేనేజర్ జూబ్లీహిల్స్, యూసఫ్ గూడ ఏటీఎంల నుంచి 76,000 రూపాయలు విత్ డ్రా అయినట్లు తమకు ఫిర్యాదు చేయడంతో నిందితులను పట్టుకున్నామని వెల్లడించారు.ప్రపుల్ కుమార్ నాయక్, హేమంత్ కుమార్ నాయక్, సుజిత్ కుమార్ నాయక్ లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

గడచిన 4 సంవత్సరాల నుంచి ప్రపుల్ నాయక్ ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాడని చెప్పారు.నిందితుల వద్ద నుండి తాము మొబైళ్లు, ల్యాప్ టాప్ లు, క్లోనింగ్ యంత్రం, స్కిమ్మర్ ను స్వాధీనం చేసుకున్నామని అన్నారు.

Advertisement

ఖరీదైన ప్రాంతాల్లోని రెస్టారెంట్లలో, పబ్బుల్లో పనికి కుదిరి అక్కడ కస్టమర్ల డెబిట్ కార్డుల వివరాలను ప్రత్యేక యంత్ర సహాయంతో సేకరిస్తాడు.కొన్ని రోజుల తరువాత పని మానేసి నకిలీ క్రెడిట్, డెబిట్ కార్డులు తయారు చేస్తాడు.

ఇలా ఇప్పటివరకు 31 బ్యాంకులకు సంబంధించిన 150 డెబిట్, క్రెడిట్ కార్డులను క్లోనింగ్ చేశాడు.మొదట ప్రపుల్ మాత్రమే మోసాలకు పాల్పడగా ఆ తర్వాత హేమంత్, సుజిత్ లను రంగంలోకి దించాడు.

వచ్చిన డబ్బును ముగ్గురు వాటాలు పంచుకుని జల్సాలు చేసేవారని పోలీసుల విచారణలో తేలింది.క్లోనింగ్ మోసాలకు పాల్పడిన ప్రపుల్ కేవలం పఓ తరగతి మాతమే చదవడం గమనార్హం.

Attachments area .

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు