పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతున్న సైనైడ్..!

ఎన్నో అంతర్జాతీయ, జాతీయ పురస్కారాలు అందుకున్న దర్శకుడు రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం సైనైడ్.

ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్, మిడిల్ ఈస్ట్ సినిమా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.

ఈ సినిమాని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకే సారిగా చిత్రీకరిస్తున్నారు.దక్షిణాది చిత్రసీమకు సంబంధించి పోలీస్ ఆఫీసర్ గా ప్రియమణి నటిస్తుండగా అదే పాత్రను హిందీలో ఎస్ పాల్ శర్మ నటిస్తోంది.

ఈ సినిమాలో తనికెళ్ల భరణి, చిత్తరంజన్ గిరి, రామ్, గోపాల్ బజాజ్, రోహిణి, సమీర్ మొదలగు తారాగణం ఈ సినిమాలో నటించబోతున్నారు.ఇక ఈ సినిమా షూటింగ్ జనవరి నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది.

ఈ సినిమా షూటింగ్ సంబంధించి హైదరాబాద్, బెంగళూరు, మంగళూరు, మైసూర్, గోవా ప్రాంతాలను ఎంచుకున్నట్లు సమాచారం.ఇకపోతే ఈ సినిమాను నిర్మించబోతున్న మిడిల్ ఈస్ట్ సినిమా ప్రైవేట్ లిమిటెడ్అధినేత ప్రదీప్ నారాయణన్ మాట్లాడుతూ.

Advertisement

ఈ సినిమా ప్రారంభం నుండి చాలా ఆదరణ లభిస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.ఈ సినిమాలో మలయాళంలో 350 సినిమాలలో నటించిన సిద్దిక్ నటిస్తుండడం, అలాగే కన్నడ చిత్ర పరిశ్రమలో 250 చిత్రాల్లో నటించిన రంగయన రఘు, అలాగే మలయాళ చిత్ర పరిశ్రమలో అవార్డులు అందుకున్న మణికంఠ ఆచారి ఇలా కొంతమంది నటిస్తుండటంతో మంచి క్రేజ్ ఏర్పడిందని ఆయన చెప్పుకొచ్చాడు.

దీనితోపాటు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అధినేత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తాము ప్రవస ఆంధ్రులు అయినప్పటికీ మేము సినిమాల మీద ఉన్న ఆసక్తితో తెలుగు సినిమాలకు ప్రాధాన్యమిస్తూ చక్కటి సినిమాలను తెరకెక్కించాలని ఉద్దేశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలియజేశాడు.ఇక ఈ సందర్భంగా దర్శకుడు రాజేష్ టచ్ రివర్ మాట్లాడుతూ ఇది వరకు జరిగిన నిజ ఆధారిత కేసు ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి దోహదపడిందని ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు