పెళ్లి శుభలేఖలో డ్రగ్స్ సరఫరా! పట్టుకున్న కస్టమ్స్ అధికారులు

ఇండియాలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న పాశ్చాత్య నాగరికత మాటున డ్రగ్స్ కూడా విస్తరిస్తుంది.

ముఖ్యంగా యువతని లక్ష్యంగా చేసుకొని డ్రగ్స్ ముఠాలు ఏదో ఒక మార్గంలో ఇండియాలోకి, అలాగే ప్రముఖ పట్టనాలలోకి డ్రగ్స్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో కొత్త కొత్త ఎత్తులు వేస్తూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.అయితే విమానాశ్రయాలలో అధికారులు ముందస్తు జాగ్రత్తలతో అలాంటి డ్రగ్స్ సరఫరాని అడ్డుకుంటున్నారు.

బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో తాజాగా భారీమొత్తంలో డ్రగ్స్ ని పట్టుకున్నారు.అయితే ఈ డ్రగ్స్ సరఫరా కోసం ముఠా సభ్యులు ఈ సారి మరింత కొంతగా పెళ్లి శుభలేఖలు వాడుకోవడం విశేషం.పెళ్లి పత్రికలని మోడరన్ గా డిజైన్ చేసి అందులో రహస్యంగా 5.05కోట్ల విలువైన ఎఫెడ్రిన్‌ అనే మత్తు మందును తరలించే ప్రయత్నం చేశారు.తనిఖీలలో భాగంగా పెళ్లి పత్రికని ఓపెన్ చేసి చూడగా అందులో డ్రగ్స్ బయటపడ్డాయి.

వాటిని కార్గో కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.మదురైకి చెందిన వ్యక్తి డ్రగ్స్‌ దాచిన 43 శుభలేఖలను ఆస్ట్రేలియాకు తరలించే ప్రయత్నం చేసినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.

Advertisement

ఇప్పటి వరకు రకరకాల ఎత్తులు వేసిన డ్రగ్స్ ముఠాలు ఇప్పుడు ఇలా పెళ్లి పత్రికలని కూడా వాడుకోవడం విశేషం.

కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి

Advertisement

తాజా వార్తలు