శివ సినిమాల కస్టడీ కూడా గుర్తుండిపోతుంది: డైరెక్టర్ వెంకట్ ప్రభు

అక్కినేని నాగచైతన్య(Nagachaitanya) కృతి శెట్టి (Kriti Shetty) హీరో హీరోయిన్గా డైరెక్టర్ వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందు రాబోతున్న చిత్రం కస్టడీ(Custody) .

ఈ సినిమా ఎన్నో అంచనాను నడుమ మే 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఇలా తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం మొత్తం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.

ఇక నాగచైతన్య సినిమా భారం మొత్తం తన భుజాలపై వేసుకొని ఈ సినిమాని తెలుగు తమిళ భాషలలో ప్రమోట్ చేస్తూ వస్తున్నారు.ఇక తాజాగా డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వెంకట్ ప్రభు కస్టడీ సినిమా గురించి మాట్లాడుతూ నాగచైతన్య కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపారు.

Advertisement

నాగార్జునసినీ కెరియర్ లో శివ సినిమా ఎలా గుర్తుండిపోతుందో నాగచైతన్య సినీ కెరియర్ లో కూడా కస్టడీ సినిమా అలా గుర్తుండిపోతుందని వెంకట్ ప్రభు తెలియజేశారు.

తెలుగు ఎమోషన్స్ తో ఒక హాలీవుడ్ సినిమా చూసాము అనే భావన ప్రతి ఒకరిలోనూ కస్టడీ సినిమా కలిగిస్తుందని డైరెక్టర్ వెంకట్ ప్రభు తెలియజేశారు.ఇక ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.ఇక ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు.

మొదటిసారి నాగచైతన్య కస్టడీ సినిమా ద్వారా తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మరి ఈ సినిమా నాగచైతన్యకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 
Advertisement

తాజా వార్తలు