మోచేతులను తెల్ల‌గా మెరిపించే క‌రివేపాకు..ఎలాగంటే?

స‌హ‌జంగా కొంద‌రి మోచేతులు న‌ల్ల‌గా, క‌ఠినంగా ఉంటాయి.

శ‌రీరం మొత్తం తెల్ల‌గా, మోచేతులు మాత్ర‌మే న‌ల్ల‌గా ఉంటే చూసేందుకు ఎంత‌ అంద విహీనంగా ఉంటుంది ప్ర‌త్యేకంగా చెప్పక్క‌ర్లేదు.

అందుకే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేందుకు నానా ప్ర‌యత్నాలు చేస్తుంటారు.అయితే మోచేతుల నలుపును వదిలించ‌డంలో క‌రివేపాకు అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి క‌రివేపాకును మోచేతుల‌కు ఎలా యూజ్ చేయాలి? అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా క‌రివేపాకు ఆకుల‌ను ఎండ బెట్టి పొడి చేసుకోవాలి.

ఇప్పుడు ఈ పొడిలో చిటికెడు ప‌సుపు మ‌రియు పాలు వేసుకుని బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని మోచేతులకు అప్లై చేసి డ్రై అయిన తర్వాత త‌డి చేతుల‌తో స్క్ర‌బ్ చేసుకుంటూ గోరువెచ్చని నీటితో కడగాలి.

Advertisement

ఇలా ప్ర‌తి రోజు చేస్తూ ఉంటే క్ర‌మంగా న‌లుపు పోయి మోచేతులు తెల్ల‌గా మెరుస్తాయి.

అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ క‌రివేపాకు పొడి, ఒక స్పూన్‌ బియ్యం పిండి మ‌రియు రెండు స్పూన్ల నిమ్మ ర‌సం వేసి క‌లుపుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్రమాన్ని మోచేతులకు అప్లై చేసి ఇర‌వై లేదా ముప్పై నిముషాల పాటు వ‌దిలేయాలి.అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి.

రోజుకు ఒక సారి ఇలా చేస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది.ఇక క‌రివేపాకు తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసి ఒక బౌల్‌లో వేసుకోవాలి.

ఇప్పుడు ఈ క‌రివేపాకు పేస్ట్‌లో ముల్తానీ మ‌ట్టి, రోజ్ వాట‌ర్ వేసి మిక్స్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని మోచేతుల‌కు ప‌ట్టించి అర గంట పాటు అలాగే ఉండనిచ్చి అనంత‌రం గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

ఇలా ప్ర‌తి రోజు చేస్తే న‌లుపు త‌గ్గి.మోచేతులు మృదువుగా, తెల్ల‌గా మార‌తాయి.

Advertisement

తాజా వార్తలు