కరెంట్ షాక్.. మహిళ ప్రాణం కాపాడిన చెప్పులు..

ఓ మహిళ ప్రాణాలను చెప్పులు కాపాడాయి.చెప్పులు కాపాడటం ఏంటీ అనుకుంటున్నారా.

అవును ఇది నిజం.ఈ ఘటన యూఎస్ లో జరిగింది.

మనం చాలా సార్లు చూసింటాం.కరెంట్ పనులు చేసేటప్పుడు రబ్బరు చెప్పులు ధరిస్తారు.

ఎందుకంటే రబ్బరు చెప్పులు ధరిస్తే కరెంట్ షాక్ కొట్టదు.అయితే ఒక మహిళ తనకు తెలియకుండా రబ్బురు చెప్పులు వేసుకోవడం వల్ల ప్రాణాలతో బయటపడింది.

Advertisement

యూఎస్ కి చెందిన కెర్రీ టాటర్ స్లీని ఓ ప్రమాదం నుంచి చెప్పులు కాపాడాయి.ఎలా అంటే.

కెర్రీ టాటర్ స్లీ ప్రతి రోజులాగానే తన ఇంట్లో పనులు చేసుకుంటుంది.ఈక్రమంలో ఆమె పెరట్లో స్విచ్ ఆఫ్ చేసేందుకు వెళ్లింది.

అప్పుడు కెర్రీ ‘పూమా’ కంపెనీకి చెందిన చెప్పులను ధరించి ఉంది.ఆ స్విచ్ బోర్డులో కరెంట్ పాస్ అయి ఉండంతో.

ఆమె ముట్టుకోగానే కరెంట్ షాక్ తగిలింది.దీంతో ఆమె ఎగిరి కొంత దూరంలో పడింది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

అంతా సెకన్లలో జరిగిపోయింది.దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Advertisement

కెర్నీ టాటర్ స్లీని పరీక్షించిన వైద్యులు ఆమె చెప్పులు ధరించడం వల్లనే ప్రాణాలతో బయటపడిందని, లేదంటే కరెంట్ షాక్ తో ఆమె ప్రాణాలు కోల్పోయేదని తెలిపారు.కోలుకున్న తర్వాత కెర్రీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

‘నేను 2800 తో కొనుగోలు చేసిన ‘పూమా’ చెప్పులే నా ప్రాణాలు కాపాడింది’ అంటూ పోస్ట్ లో పేర్కొంది.దీంతో ఆ పోస్ట్ వైరల్ అయ్యింది.

అయితే పూమా చెప్పులు ధరించడంతోనే బతికానని చెప్పడంతో చాలా మంది స్పందించారు.అది పూమా కంపెనీ గొప్పతనం కాదని అంటున్నారు.

ఏ రబ్బరు చెప్పులు ధరించినా విద్యుత్ షాక్ తగలదని చెబుతున్నారు.కెర్రీ తనకు తెలియకుండానే రబ్బరు చెప్పులు ధరించడం వల్ల ప్రాణాలతో బయటపడిందని అంటున్నారు.

తాజా వార్తలు