నేషనల్ హైవే పై దర్శనమిచ్చిన నోట్ల కట్టలు

డబ్బు అందరికీ కావాలి దాన్ని సంపాదించడం కోసమే జనాలు నానా కష్టాలు పడుతుంటారు మరికొందరు ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతుంటారు.ఇలా కష్ట పడలేక మరోపక్క అవినీతి మార్గంలో వెళ్ళలేక ఊరకనే డబ్బులు తమకు దొరికితే బాగుంటుందని కొందరు కలలు కంటుంటారు.

 Money At Anantapur National Highway, Social Media, Anantapur National Highway, F-TeluguStop.com

అలా వాళ్ళు కన్న కల నిజమైతే బాగుండని పాపం పొద్దుటి నుండి ఈవినింగ్ దాకా తీరికలేని దేవుడిని అడిగిన కోరికే రోజూ అడుగుతూ ఇబ్బంది పెడుతుంటారు.

అలా అడిగింది అడిగి కొందరు బాగా ఇబ్బంది పెట్టేసినట్లు ఉన్నారు అందుకే దేవుడు తాజాగా అనంతపురం జిల్లా రాయదుర్గం నేషనల్ హైవేపై భారీగా డబ్బు స్థానికులకు దొరికేలా చేశాడు.

ఇక్కడ స్థానికులకు దాదాపు మొత్తం 10లక్షల రూపాయలు దొరికాయి.వడ్రవన్నూరు శివారులో గుర్తుతెలియని వ్యక్తులు ఈ డబ్బు మొత్తాన్ని పడేసి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.అసలు ఇంతకీ ఇక్కడ డబ్బు ఎవరు ఎందుకు పడేశారో అనే కోణాలలో ప్రస్తుతం రాయదుర్గం పోలీసులు విచారణ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

ఈ ఘటన చూసిన వారంతా ఇలా మాకు డబ్బులు ఎప్పుడు దొరికేలా చేస్తావు అని దేవుడిని మరింత విసిగించపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube