దాణాకు ప్రత్యామ్నాయంగా అజోల్లా సాగు.. పశుగ్రాసం ఖర్చు సగానికి పైగా ఆదా..?

వ్యవసాయం చేసే రైతులను దాదాపుగా చాలామంది రైతులు పాడి పరిశ్రమ, జీవాల పెంపకం, కోళ్లు లాంటివి పెంచుతుంటారు.

వీటి పోషణలో 60 శాతం ఖర్చు కేవలం మేతకే అవుతుంది.

పశువులకు కావలసిన పచ్చిమేత కొరత కాస్త అధికంగా ఉండడం వల్ల దాణా కు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ పెరిగింది.రైతులు అధిక ఖర్చులు భరించి, పాడి పరిశ్రమలో మంచి లాభాలు పొందలేకపోతున్నారు.

అయితే పశు పోషకాలకు అజోల్లా ఒక వరం అనే చెప్పాలి.ఈ అజోల్లా( Azolla ) ను ఇంటి వద్ద, ఉద్యాన తోటలలో, పంట పొలాల్లో చాలా సులభంగా పెంచుకోవచ్చు.

ఈ అజోల్లా లో పోషక విలువలు చాలా అంటే చాలా ఎక్కువ.నిత్యం అజోల్లా దిగుబడి తీసుకోవచ్చు.

Cultivation Of Azolla As An Alternative To Fodder Saving More Than Half The Cost
Advertisement
Cultivation Of Azolla As An Alternative To Fodder Saving More Than Half The Cost

పాడి పశువులకు పచ్చిమిర ఎంత సమృద్ధిగా అందించగలిగితే పశుపోషణ అంత లాభాల బాటలో ఉంటుంది.కానీ పశుగ్రాస క్షేత్రాలు తగ్గిపోవడం వల్ల, దాణాపై అధికంగా ఆధారపడడం వల్ల, పశుపోషణ రోజురోజుకు భారంగా మారుతోంది.అయితే కొంతమంది రైతులు అజోల్లా ను సాగు చేస్తూ పాడి పరిశ్రమలో అధిక లాభాలు పొందుతున్నారు.

ఈ అజోల్లలో 25 నుంచి 30% వరకు ప్రోటీన్లు ఉంటాయి.

Cultivation Of Azolla As An Alternative To Fodder Saving More Than Half The Cost

బర్సీం, లూసర్న్, అలసంద( Barceum, Lucerne, Alasanda ) మొక్కలను మేలైన గడ్డి జాతులుగా పరిగణిస్తారు.కానీ వీటికంటే అజోల్ల మంచి పోషణ ఇస్తుందని పరిశోధనలు తెలుపుతున్నాయి.శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఒక కిలో దాణా, రెండు కిలోల అజోల్లాకు సమానం.

ఒక కిలో దాణా కు అయ్యే ఖర్చు సుమారుగా 20 రూపాయలు.అదే అజోల్లా అయితే రెండు కిలోలు ఉత్పత్తి చేయాలంటే కేవలం రెండు రూపాయల ఖర్చు మాత్రమే అవుతుంది.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మీ అభిమానం తగలెయ్య.. ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత?

పాడి పశువులకు అజోల్లా ను ఆహారంగా వేయడం వల్ల దాదాపుగా 20% పాల దిగుబడి పెరుగుతుంది.ఈ అజోల్ల సాగుతో పశుగ్రాసాల కొరతకు పెట్టవచ్చు.

Advertisement

తాజా వార్తలు