కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించిన సిరాజ్... ఏమన్నాడంటే?

భారత దేశంలో క్రికెట్ కు ఎంత ఆదరణ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.అన్ని దేశాలలో క్రికెట్ అంటే ఒక ఆట మాత్రమే.

కాని మన దేశంలో క్రికెట్ ను ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా  భావిస్తారు.అందుకే భారతదేశంలో రోజురోజుకు క్రికెట్ కు ఆదరణ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.

క్రికెట్ ను కెరియర్ గా ఎంచుకోవాలని అనుకున్న ప్రతి ఒక్కరికీ ఇక అభిమాన క్రికెటర్ ఉంటారు.వాళ్ళను చూస్తూనే క్రికెట్ ను ఆడటం మొదలుపెడతారు.

వాళ్ళనే ఎంతగానో అభిమానించడం మొదలుపెడతారు.అదృష్టం బాగుండి అంతర్జాతీయ స్థాయికి వెళితే ఇక అభిమాన క్రికెటర్ తో గడుపుతున్న సమయాన్ని వారి జీవితంలో అద్భుత క్షణాలుగా భావిస్తారు.

Advertisement

అంతలా క్రికెట్ ,అదే విధంగా క్రికెట్ ప్లేయర్ లు యువ క్రికెటర్ ల జీవితాలతో ముడిపడి పోయింది.ఇక అసలు విషయం లోకి వస్తే మహమ్మద్ సిరాజ్ క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కరలేని పేరు.

అత్యంత నిరుపేద కుటుంబం నుండి వచ్చి అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదగడం అంటే మామూలు విషయం కాదు.ప్రస్తుతం బౌలర్ గా సత్తా చాటుతూ అంతర్జాతీయంగా స్టార్ బౌలర్ గా మారాడు.

తాజాగా సిరాజ్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు.మా నాన్న మరణించినప్పుడు నేను మా నాన్నను చివరి చూపు చూసుకోలేని పరిస్థితులలో నేను వెళ్లలేకపోయిన పరిస్థితులలో, విరాట్ కోహ్లీ నా గదికి వచ్చి నన్ను హాగ్ చేసుకొని  నన్ను ఓదార్చి, నన్ను మానసికంగా దృఢంగా ఉంచడానికి ప్రయత్నం చేశాడు.

ఏ పిచ్ లోనైనా నీ బౌలింగ్ సరిగ్గా సరిపోతుందని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తాడని సిరాజ్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు