ఐపీఎల్ కోసం పెళ్లి వాయిదా వేసిన క్రికెటర్

ఐపీఎల్ వచ్చిందంటే చాలు.దేశంలో కోట్లాది క్రికెట్ ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతుంటారు.

విదేశాల్లోనూ ఈ టోర్నమెంట్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

అలాంటి ఈ మెగా టోర్నమెంట్‌లో ఆడాలని ప్రతి క్రికెటర్‌కూ ఉంటుంది.

ఇదే కోవలో బెంగళూరు జట్టుకు ఎంపికైన రజత్ పాటిదార్ మొదట్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.అయితే కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సత్తా చాటాడు.

దేశమంతా తన గురించి చర్చించుకునేలా చేశాడు.ఐపీఎల్ కోసం అతడు తన పెళ్లిని సైతం వాయిదా వేసిన విషయం బయటకు రావడంతో అంతా అవాక్కవుతున్నాయి.

Advertisement

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.ఫిబ్రవరిలో నిర్వహించిన ఐపీఎల్-2022 మెగా వేలంలో రజత్ పాటిదార్ అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలాడు.ఐపీఎల్-2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన పాటిదార్ అంతగా ప్రభావం చూపలేదు.గతేడాది 4 మ్యాచ్‌లు ఆడి కేవలం 71 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

దీంతో ఈ ఏడాది వేలంలో అతడిని బెంగళూరుతో సహా ఏ జట్టు కొనేందుకు ముందుకు రాలేదు.ఇక ఎలాగో అతడికి ఐపీఎల్ అవకాశం దక్కలేదని కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

మే 9న ఓ యువతితో అతడికి వివాహం నిశ్చయించారు.బంధువులు, సన్నిహితుల సమక్షంలో భారీ హంగులు లేకుండా పెళ్లి వేడుక చేయాలని భావించారు.

ఈ తరుణంలో ఆర్సీబీ నుంచి అతడికి ఊహించని విధంగా పిలుపు వచ్చింది. లువ్నిత్ సిసోడియా అనే క్రికెటర్ గాయం కారణంగా ఐపీఎల్ నుంచి దూరమయ్యాడు.అతడి స్థానంలో బేస్ ప్రైస్ రూ.20 లక్షలకు పాటిదార్‌ను బెంగళూరు జట్టులో చేర్చుకుంది.తన ఎంపిక జట్టుకు ఎంత విలువైందో బెంగళూరుకు తెలిసేలా చేశాడు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

ఐపీఎల్ టైటిల్ సాధించాలనే బెంగళూరు కలను నిలబెట్టాడు.లక్నోతో జరిగిన కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 54 బంతుల్లో 112 పరుగులు సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు.ఆర్సీబీ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోయే సెంచరీ చేశాడు.

Advertisement

దీంతో టైటిల్ రేసులో బెంగళూరు మరో అడుగు ముందుకు వేసింది.శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో బెంగళూరు తలపడనుంది.

ఐపీఎల్‌లో నాకౌట్ దశలో సెంచరీ కొట్టిన తొలి అన్‌క్యాప్డ్ బ్యాటర్‌గా పాటిదార్ నిలిచాడు.అతడిపై కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడు.

తాను చూసి అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఒకటిగా పాటిదార్ సెంచరీని కొనియాడాడు.ఇక ఐపీఎల్ పూర్తైన తర్వాత జూన్ 6 నుంచి జరిగే రంజీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్‌తో మధ్యప్రదేశ్ తలపడుతుంది.

మధ్యప్రదేశ్ తరుపున రజత్ పాటిదార్ ఆడనున్నాడు.జూలైలో రత్లామ్‌కి చెందిన అమ్మాయితో పెళ్లి చేసుకోనున్నాడు.

తాజా వార్తలు