సెలబ్రిటీల పాలిట శాపంగా కరోనా..?

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది.రోజుకు వేల సంఖ్యలో ప్రాణాలను బలి తీసుకుంటుంది.

దీంతో స్మశానవాటికలలో డెడ్ బాడీలు కాలిపోవడానికి క్యూలైన్ కట్టాల్సిన పరిస్తితి ఏర్పడింది.ఇక ఈ మహమ్మారి ప్రభావం సినీ పరిశ్రమపై గట్టిగానే చూపిస్తోంది.

ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి పలువురు సినీ ప్రముఖులు ప్రాణాలను కోల్పోయారు.యాంకర్, నటుడు ప్రదీప్ మాచిరాజు తండ్రి పాండురంగ మాచిరాజు కరోనా కారణంగా మే 1న మృతి చెందారు.

కరోనా వల్ల తాను ఇద్దరు వ్యక్తుల్ని కోల్పోయానని సామాజిక మాధ్యమాల ద్వారా బాలీవుడ్ నటి భూమీ పెడ్నేకర్ వెల్లడించింది.అయితే వారెవరో తెలపలేదు.

Advertisement

సింగర్ బాబా సెగల్ కుటుంబంలోనూ కరోనా విషాదం నింపింది.ఆయన తండ్రి కరోనా కారణంగా మరణించారు.

తెలుగులో శ్రీవిష్ణు నటించిన తిప్పరా మీసంతో హీరోయిన్​గా పరిచయమైన నిక్కీ తంబోలి తన సోదరుడు వైరస్​ సోకి తుదిశ్వాస విడిచాడని సోషల్​మీడియా ద్వారా తెలుపుతూ భావోద్వేగానికి గురైంది.రంగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పియా బాజ్​పేయీ తన సోదరుడు వెంటిలేటర్​ చికిత్స అందకపోవడం వల్ల చనిపోయాడని కన్నీటిపర్యంతమైంది.

పదిరోజుల వ్యవధిలోనే నటుడు గౌరవ్ చోప్రా తల్లిదండ్రులు కరోనాతో మృతిచెందారు.బాహు హమారీ రజనీకాంత్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రిద్దిమా పండిట్ కరోనా కారణంగా తన తల్లిని పోగొట్టుకుంది.

గత కొన్ని రోజులుగా కరోనాతో పోరాడి చివరకు ప్రాణాలు వదిలారు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కుమార్ వట్టి.ఈయన మా అబ్బాయి అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఇలా చాలా మంది సినీ ప్రముఖులు కరోనాతో తమ ప్రాణాలను వదిలారు.ఇకపోతే పలువురు సినీ ఆర్టిస్టులు, చిన్న పాత్రలు వేసేవారు, టెక్నీషియన్లు, ప్రొడక్షన్ టీమ్ మెంబర్లు, కోఆర్టిస్టులు.

Advertisement

ఇలా చాలా మందే కరోనాకు బలయ్యారు.ప్రస్తుతం కరోనా వచ్చి పోరాడుతున్నవారు చాలా మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు.

తాజా వార్తలు