వైరల్ : మాగ్నెట్ ఫిషింగ్‌కు వెళ్లిన జంటకు వరించిన అదృష్టం.. దొరికిన లక్ష డాలర్లు..

మాగ్నెట్ ఫిషింగ్.( Magnet Fishing ) ఎవరైనా ఫిషింగ్ గురించి వినింటారు కానీ ఈ మాగ్నెట్ ఫిషింగ్ గురించి విన్నారా.

అయితే అసలు మ్యాగ్నెట్ ఫిషింగ్ అంటే ఏంటి దాంతో ఏం చేస్తాననే విషయం ఒకసారి చూస్తే.కొలనులు, సరస్సులు, చెరువులు, బావులు, నదులు, సముద్రాలు ఇలా జలపాతాలు ఉన్నచోట ఎక్కడైనా సరే ఓ ఐస్కాంతాన్ని ఏర్పాటు చేసుకొని దానిని నీళ్లలో జారవేరుస్తారు.

ఆ సమయంలో ఆ అయస్కాంతానికి ఈ వస్తువులు అయితే ఆకర్షిస్తాయో వాటిని నేలపైకి లాగుతారు.దీనినే మ్యాగ్నెట్ ఫిషింగ్ అంటారు.

అయితే ఈ పద్ధతి ఎక్కువగా పాశ్యత్య దేశాలలో ఉంది కానీ మన భారతదేశంలో చాలా తక్కువగా ఉంది.

Advertisement

ఇక అసలు విషయంలోకి వెళితే.తాజాగా అమెరికాలో న్యూయార్క్ సిటీ( Newyork City ) బీన్స్ ఏరియాలో ఓ పార్కులో ఉన్న సరస్సు వద్ద ఈ మాగ్నెట్ ఫిషింగ్ కు వెళ్లిన ఓ జంటకు అనుకోకుండా అదృష్టం వరించింది.బార్బీ అగోస్తి,( Barbie Agostini ) జేమ్స్ కేన్( James Kane ) అనే జంట అయస్కాంతాన్ని ఓ తాడు కట్టి సర్సులోకి వేశారు.

అలా కొద్దిసేపు వేసిన తర్వాత ఆ అయస్కాంతం కు బరువు ఎక్కువగా ఉన్నట్లు వారికి అనిపించింది.దాంతో వారు దానిని చాలా బలంగా కష్టపడి ఎలాగోలాగా బయటకి తీసుకోవచ్చారు.

వారి అయస్కాంతానికి ఏకంగా ఓ చిన్నపాటి బీరువా చిక్కింది.ఇక అందులో ఏముందన్న విషయాన్ని చూడగా ఏకంగా లక్ష డాలర్లు( One Lakh Dollars ) వారికి లభించింది.

అంటే భారత కరెన్సీలో దాదాపు 83 లక్షల రూపాయలు వారికి దొరికింది అన్నమాట.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 29, శనివారం 2024
వైరల్ వీడియో : వీలైతే శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను.. ఆనంద్ మహీంద్రా..

అయితే ఏ విషయాన్ని వెంటనే అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఆ బీరువాకు ఈ క్రైమ్ కు సంబంధం లేదని ఆ జంట పోలీసులకు తెలిపారు.ఇలాంటి బీరువాలను ఇదివరకు మేము చాలానే కనుగొన్నామని ఈ బీరువా ఓనర్ ఎవరో కనుక్కోవడానికి అందులో ఎటువంటి డాక్యుమెంట్స్ లేవని తెలిపారు.ఆ తర్వాతనే పోలీసులు ఆ జంటకు ఆ బీరువాను అప్పగించారు.

Advertisement

అయితే ఆ బీరువా చాలా రోజుల నుంచి నీటిలో ఉండడం ద్వారా చాలా నోట్లు తడిచిపోయాయి.ఇక వాటన్నిటిని శుభ్రపరిచి చివరికి ఎంత వరకు బాగున్నాయో త్వరలో వెల్లడిస్తామని ఆ జంట పేర్కొంది.

ఇదివరకు కూడా ఆ ప్రాంతంలో అనేక బీరువాలను కనుగొన్నట్లు అందులో నాటు తుపాకులు సెకండ్ వరల్డ్ వార్ సమయం నాటి గ్రైనేట్స్ లాంటి అనేక పేలుడు పదార్థాలు కూడా దొరికినట్లు తెలియజేశారు.

తాజా వార్తలు