గత ప్రభుత్వ హయంలో అవినీతి, భూ కబ్జాలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా :గత బి ఆర్ ఏస్ ప్రభుత్వం హయంలో అవినీతి, భూ కబ్జాలు తప్ప ప్రజలకు న్యాయం చేసింది ఏమిలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కనమేని చక్రదర్ రెడ్డి అన్నారు.

ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి లో గల జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కణమేణి చక్రాధర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో అవినీతి భూకబ్జాలు తప్ప ప్రజలకు న్యాయం చేయలేదని సాయం చేస్తున్నట్టు నటించిందని అన్నారు.

గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోతుందని అయినను రానున్న రోజుల్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను చేపడతామని ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెంట నడవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ మండల నాయకులతో పాటు, స్థానిక కాంగ్రెస్ నాయకులు మరి వెంకటరెడ్డి, ముచ్చ రాజిరెడ్డి, ముద్ర కుల ప్రేమ్ సాయి, వెముల తేజ, తదితరులు పాల్గొన్నారు.

బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సాధారణ సమావేశం

Latest Rajanna Sircilla News