అగ్రరాజ్యం లో నవంబర్ 1 నుండి కరోనా వ్యాక్సిన్ పంపిణీ...!?

గత ఎనిమిది నెలల నుండి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ కరోనా వ్యాప్తి నివారణ కోసం ప్రపంచంలోని ప్రతి దేశం వ్యాక్సిన్ కనుగొనేందుకు అనేకమంది సైంటిస్టులు అహర్నిశలు పని చేస్తున్నారు.

ఇందులో భాగంగానే ఇప్పటికే అనేక కంపెనీలు కరోనా వ్యాక్సిన్ కనుగొని దానిని ప్రజలకు దగ్గర చేయడానికి చివరి దశలో ట్రైల్స్ లో ఉన్నాయి.ఇప్పటికే రష్యా దేశ ప్రజలకి కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన సంగతి కూడా అందరికీ తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికా ప్రభుత్వం కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసింది.అందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.

అమెరికా దేశంలోని ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేసేందుకు అగ్రరాజ్యం సిద్ధం అవుతోంది.అగ్రరాజ్యానికి చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులకు ఆ దేశ ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

ఇందుకు సంబంధించి అమెరికా దేశంలోని 50 రాష్ట్రాలకు చెందిన ఆరోగ్య శాఖ అధికారులు మొత్తం నవంబర్1 నుండి ప్రజలకు ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉండాలని ఆరోగ్య శాఖ పేర్కొంది.అయితే నవంబర్ 3న అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి.

అయినా కానీ కేవలం రెండు రోజుల ముందరే దేశంలో కరోనా వ్యాక్సిన్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.అయితే మొదటగా ఈ వ్యాక్సిన్ ని కేవలం హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, అలాగే వృద్ధులకు,ఇంకా ఎవరికైనా వారి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్న వారికి మాత్రమే మొదటగా వ్యాక్సిన్ ను ఇవ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు