కరోనా వ్యాక్సిన్‌ను వేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి.దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాయి.
అయితే వ్యాక్సిన్‌ను వేసేముందు కరోనా వ్యాక్సిన్ డ్రై రన్‌ను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.జనవరి 2న అన్ని రాష్ట్రాలు కరోనా వ్యాక్సిన్ డ్రై రన్‌లో పాల్గొంటున్నాయి.
ఇందులో భాగంగానే డ్రైరన్‌ను తెలంగాణలోనూ నిర్వహించేందుకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఈమేరకు నిర్ణయించింది.ఇందుకు గానూ రెండు జిల్లాలను డ్రైరన్ కోసం ఎంపిక చేసింది.
హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్‌ను శనివారం చేపట్టనున్నారు.
ఈ డ్రైరన్‌కు సంబంధించిన ట్రైనింగ్‌ను సిబ్బందికి ఇస్తున్నట్లు రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.శ్రీనివాసరావు తెలిపారు.వ్యాక్సిన్ ఎలా వేయాలి, వ్యాక్సిన్‌ను ఎలా స్టోరేజీ చేయాలి, ఎలా ఎక్కించాలనే అంశాలపై సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తున్నారు.
హైదరబాద్,రంగారెడ్డి జిల్లాల్లో 6 సెంటర్లలో వ్యాక్సిన్ డ్రై రన్‌ను చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.

వ్యాక్సినేషన్ డ్రై రన్‌ను ఎలా చేపట్టాలో ఇప్పటికే కేంద్రం ఆయా రాష్ట్రాలకు గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది.వ్యాక్సిన్ వేయడం, సిరంజీల్లో వ్యాక్సిన్ ఎక్కించడం, వ్యాక్సిన్‌ను ఎంత టెంపరేచర్‌లో ఉంచడం, వ్యాక్సిన్ వేసుకునేవారి పేర్లను కోవిన్ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో నమోదుచేయడం లాంటివన్నీ కూడా కేంద్రం విడుదల చేసిన గైడ్‌లైన్స్‌లో తెలిపింది.
ఈ గైడ్‌లైన్స్‌లకు అనుగుణంగానే రేపు చేపట్టబోయే రన్‌లో ఎలా వ్యాక్సిన్ ఇవ్వాలో తెలంగాణ పబ్లిక్ హెల్త్‌డిపార్ట్మెంట్ అన్ని చర్యలు తీసుకుని ట్రైనింగ్ ఇస్తున్నారు.
ఈప్రాసెస్‌లో ఏమైనా సమస్యలు తలెత్తితే ఆ విషయాన్ని వెంటనే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సమాచారం అందించనుంది.
కరోనా వ్యాక్సిన్‌ను ఎవరికి వేస్తున్నారో, వేసిన తరువాత వారి వివరాలను కోవిన్ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.
వైద్యారోగ్యశాఖ వివరాల ప్రకారం వ్యాక్సిన్‌ను వేసుకునే లబ్దిదారులు సంబంధిత గుర్తింపు కార్డులు తీసుకుని శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు సూచించిన వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.