క‌రోనాకు రెడ్ కార్పెట్‌.. ఇక ప్ర‌జ‌లే బాధ్యులు...!

దేశం మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు న‌డిచిన విధానం ఒక‌తీరు.నేటి నుంచి న‌డ‌వ‌బోయే విధానం మ‌రోతీరు.

దీనికి కార‌ణం ఉంది.క‌రోనా మ‌హ‌మ్మారి నియంత్ర‌ణ విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కు బాధ్య‌త తీసుకున్న కేంద్ర ప్ర‌భుత్వం.

నేటి నుంచి పూర్తిగా చేతులు ఎత్తేసింది.అంటే.

ఇక‌, క‌రోనా నియంత్ర‌ణ అనేది పూర్తిగా ప్ర‌జ‌ల చేతుల్లోకే రానుంది.పార్క‌లు ఓపెన్ కానున్నాయి.

Advertisement

స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి.మ‌రీ ముఖ్యంగా యువ‌త ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా హాళ్లు ప్రారంభం కానున్నాయి.

దీంతో క‌రోనా విజృంభ‌ణ‌కు రెక్క‌లు తొడిగిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.దేశంలో ప్ర‌స్తుతం క‌రోనా త‌గ్గిన‌ట్టే క‌నిపిస్తోంద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నుంచి ఏపీ సీఎం జ‌గ‌న్ వ‌ర‌కు చెబుతున్నారు.

కానీ, అంత‌ర్జాతీయ నివేదిక‌లు, వైద్యుల సూచ‌న‌ల మేర‌కు ఇది తొలిద‌శ మాత్ర‌మేన‌ని, మ‌లి ద‌శ పుంజుకుంటుంద‌ని అంటున్నారు.వాస్త‌వానికి ఇప్పుడే భార‌త్ వంటి దేశాలు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.

మ‌రీ ముఖ్యంగా ప్ర‌స్తుతం గ్రామీణ వ్య‌వ‌స్థ‌పై క‌రోనా ప్ర‌భావం చూపించే అవ‌కాశం క‌నిపిస్తోంది.నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌కే ప‌రిమిత‌మైన ప్రభావం.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
ఓవరాక్షన్ చేసిన పోలీస్.. ట్రక్ డ్రైవర్‌ ఇచ్చిన ట్విస్ట్‌కి పరార్.. (వీడియో)

ఇప్పుడు గ్రామాల‌కు విస్త‌రించింద‌ని ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా చెబుతున్నాయి.ఈ నేప‌థ్యంలో ఇప్పుడు మ‌రింత జాగ్ర‌త్త‌గా ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉండ‌గా.

Advertisement

రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు నిధులు ఇవ్వ‌లేక .పారిశ్రామిక రంగం కుదేలైన నేప‌థ్యంలో ఇప్పుడు కేంద్రం అన్‌లాక్ 5.0ను ప్ర‌క‌టించింది.దీంతో దాదాపు అన్నింటికీ రెడ్ కార్పెట్ ప‌రిచేసింది.

ఇది మున్ముందు మ‌రింత ప్ర‌మాద కారి అవుతంద‌నేది ప్ర‌ముఖుల విశ్లేష‌ణ‌.మ‌రోవైపు.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌జ‌లు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకున్నారో తెలియ‌దు.ఇప్పుడు మాత్రం సంపూర్ణంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం వారిపైనే ఉంద‌ని అంటున్నారు.

ప్ర‌భుత్వాల‌పై ఆధార‌ప‌డ‌డం త‌గ్గిపోయింద‌ని ప్ర‌జ‌లే ముందు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని వారు సూచిస్తుండ‌డం గ‌మ‌నార్హం.మొత్తానికి అన్‌లాక్ 5.0 ప్ర‌జ‌ల‌కు ఇబ్బందేన‌ని విశ్లేష‌ణ‌.

తాజా వార్తలు