తెలంగాణలో తీవ్రరూపం దాలుస్తున్న వైరస్.. ఆగిన కరోనా టెస్టులు.. !

సమాజం అంటే ప్రజలతో కూడుకున్న సమూహం.రాజకీయం అంటే ప్రజల కోసం ఏర్పరచుకున్న వ్యవస్ద.

కాబట్టి పాలకులున్నది ప్రజాసేవ చేయడానికి అన్న విషయాన్ని విస్మరిస్తున్న నాయకులు తమ స్వార్ధం కోసం జనాన్ని బలిచేస్తున్నారన్నది జగమెరిగిన సత్యం ఇందుకు నిదర్శనం ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న కరోనా అనే పెద్ద సమస్య.ఈ సమయంలో ప్రజలను అన్ని విధాలుగా ఆదుకోవలసిన అధికారుల, ప్రభుత్వ పని తీరు పై కోర్టు కూడా అసంతృప్తిని వెల్లడిస్తుంది.

ఇలాంటి క్లిష్ట పరిస్దితుల్లో కరోనా ప్రళయంగా మారి ప్రాణాలను హరిస్తున్న క్రమంలో చిన్నగా అనారోగ్యం కలిగిన ప్రజల్లో ఆందోలన కలుగుతుంది.ఇది కరోనా అనే అనుమానాలు వస్తున్నాయి.

మరి ఇలాంటి సమయంలో కరోనా టెస్టులు చేయించుకునేందుకు ప్రజలు పీహెచ్‌సి, వైద్యారోగ్య కేంద్రాల ఎదుట బారులు తీరుతున్నారు.ఇలా కోవిడ్ టెస్టులు చేయించుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ఆస్పత్రి వర్గాలు కరోనా కిట్ల కోరతను ఎదుర్కొంటున్నాయి.

Advertisement

ఈ విషయాన్ని స్వయంగా ఆరోగ్యశాఖ ప్రకటించడం బాధాకరం.దీని వల్ల కరోనా పరీక్షలు నిలిచిపోయినట్లు సమాచారం.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు