కరోనా సీజన్-2 కూడా వస్తుందంటున్న శాస్త్రవేత్తలు, ఎప్పుడంటే

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే.దీనితో ఈ మహమ్మారి ఎప్పుడు అంతరించిపోతుందా అని ప్రతి ఒక్కరూ కూడా బిక్కు బిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు కరోనా మరణాలు పెరుగుతున్నాయి కానీ ఏమాత్రం తగ్గడం లేదు.దీనితో కరోనా మహమ్మారి పేరు చెబితేనే జనాలు వణికిపోయే పరిస్థితులు వస్తున్నాయి.

అయితే తొలుత చైనా లో మొదలైన ఈ కరోనా మహమ్మారి ఆ తరువాత తగ్గుముఖం పట్టడం తో 75 రోజుల లాక్ డౌన్ ను కూడా ఎత్తేశారు.అయితే లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత అక్కడ అనూహ్యంగా కరోనా కేసులు మరోసారి నమోదు కావడం తో కరోనా సీజన్-2 వచ్చింది అని అంటున్నారు.

అయితే చైనా లో నెలకొన్న పరిస్థితులను చూసుకుంటే ఈ కరోనా వైరస్ ఒకరకంగా ఏ దేశంలో అయినా తగ్గినా కూడా మళ్లీ అది తిరిగి వస్తుంది అని సైంటిస్ట్ లు అంచనా వేస్తున్నారు.అయితే వర్షాకాలంలో అంటే జులై లేదా ఆగస్టు నెలలలో ఈ కరోనా వైరస్ సీజన్-2 వచ్చే అవకాశం ఉందంటూ సైంటిస్ట్ లు చెబుతున్నారు.

Advertisement

ఇప్పటికే ఈ కరోనా వైరస్ మే మధ్యనాటికి భీభత్సంగా పెరుగుతోందంటూ WHO ప్రకటించిన విషయం విదితమే.అయితే మే మధ్యనాటికే కాకుండా జులై,ఆగస్టు నెలలో కూడా ఈ కరోనా సీజన్-2 వస్తుంది అంటూ సైంటిస్ట్ లు హెచ్చరిస్తున్నారు.

అయితే, వర్షాకాలంలో వచ్చే ఈ కరోనా సీజన్ 2లో కరోనా వైరస్ ఎప్పుడు ఉధృతరూపం దాలుస్తుందనేది మాత్రం ఇంకా లెక్కలు వేయలేదు.అయితే, అప్పుడు ప్రజలు పాటించే సామాజిక దూరాన్ని బట్టి ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు.

‘ప్రస్తుతం మనం ఉన్న స్థితి నుంచి మామూలు పరిస్థితికి వస్తాం.అయితే, ఆ తర్వాత కూడా వైరస్ వ్యాప్తి ఉండొచ్చు.

చైనాలో రవాణా పరంగా కొన్ని సడలింపులు ఇచ్చిన తర్వాత అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది.’ అని ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌కు చెందిన వారు కూడా అంగీకరిస్తున్నారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

మార్చి 25న (లాక్ డౌన్ విధించిన తర్వాత రోజు) దేశంలో 618 కరోనా పాజిటివ్ కేసులు, 13 మరణాలు నమోదయ్యాయి.అయితే, నేటి వరకు లెక్కిస్తే దేశంలో మరణాల సంఖ్య 718కి పెరిగింది.

Advertisement

కరోనా పాజిటివ్ కేసులు 23,077 నమోదయ్యాయి.అయితే, దేశంలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపయ్యే సమయం లాక్ డౌన్ ముందు 3.4 రోజులుగా ఉండగా, అది ఇప్పుడు 7.5 రోజులకు పెరిగింది.దేశంలో కరోనాకు చికిత్స తీసుకుని కోలుకునే వారి సంఖ్య కూడా ఆశాజనకంగా ఉంది.

తాజా వార్తలు