కరోనా ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న తీరు చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురి అవుతున్నారు.అయితే మొన్నటి వరకు ఉష్ణ్రోగ్రత ఎక్కువ ఉన్న దేశాల్లో కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందని అనుకున్నారు.
సాదారణంగా ఏ వైరస్ అయినా కూడా ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటే ఖచ్చితంగా వ్యాప్తి చెందదు. అలాగే కరోనా కూడా 40 నుండి 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ఇండియా వంటి దేశాల్లో ఖచ్చితంగా స్పీడ్‌గా వ్యాప్తి చెందదు అనుకున్నారు.
కాని ఆ అంచనా నిజం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తాజాగా ఒక ప్రయోగంలో కరోనా వైరస్ 92 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కూడా బతికే ఉంటుందని, అంతటి వేడిలో 15 నిమిషాల పాటు వైరస్ బతికి ఉంటుందని, ఆ తర్వాత చనిపోతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
అందుకే ఎండలో తిరుగుతున్నాం, వేడి నీళ్లు తాగుతున్నాం మాకు ఏం కాదు అనే ఉద్దేశ్యంతో బయట తిరగవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టినంత కాలం ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిందే అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.