నెలలు నిండకుండానే పుట్టిన ఓ చిన్నారి కరోనా బారిన పడి కోలుకుంది.బెంగళూరులోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో ఆగస్టు 13వ తేదీన ఓ మహిళకు పాప పుట్టింది.
పుట్టిన పాప కేవలం 980 గ్రాములే ఉండటంతో పాపను వాణీ విలాస్ ఆస్పత్రికి తరలించారు.చిన్నారిని పీడియాట్రిక్ ఐసోలేషన్ వార్డులో జాయిన్ చేసి చికిత్స అందించారు.5 రోజుల తర్వాత కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.రిపోర్టుల్లో పాజిటివ్ వచ్చింది.
దీంతో పాపను విక్టోరియా దవాఖానాలో ట్రామాకేర్ సెంటర్ కు తరలించారు డాక్టర్లు.కాగా నెల రోజుల పాటు చికిత్స అందుకున్న చిన్నారి కరోనాను జయించి మంగళవారం డిశ్చార్జ్ అయింది.
తక్కువ బరువుతో పుట్టిన చిన్నారికి అనేక పరీక్షలు నిర్వహించామని వైద్యులు తెలిపారు.ఆరోగ్యవంతమైన పిల్లాడి బరువు 2.8 నుంచి 2.9 కిలోల వరకు ఉంటుందని, కానీ ఈ పాప పుట్టినప్పుడు కేవలం 980 గ్రాములే ఉందన్నారు.కరోనా లక్షణాలు కనిపించడంతో కోవిడ్-19 నియోనాటల్ సెప్సిన్ చికిత్సను అందించి చిన్నారికి టీసీసీలో ఎక్స్ ప్రెస్ బ్రెస్ట్ మిల్స్ ఇచ్చామన్నారు.యాంటీ బయాటిక్స్, ఐవీఎఫ్ ఫార్ములాతో చిన్నారి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు.
నెగిటివ్ వచ్చిన తర్వాత బరువు పెరిగేందుకు చికిత్స చేసేందుకు వాణీ విలాస్ దవాఖానాకు తిరిగి పంపించామని బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్జ్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పిడిట్రిక్ కే.మల్లేశ్ అన్నారు.డిశ్చార్జ్ సమయంలో పాప బరువు 1.2 కిలోలుగా ఉందని, తల్లిపాలు ఎలా ఇవ్వాలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించినట్లు ఆయన తెలిపారు.