యాప్‌లతో గేమ్‌లు.. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌లు: లాక్‌డౌన్‌లో ఇండియన్స్ వీటిని తినేశారంట!

కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు విధించిన లాక్‌డౌన్ మనిషి జీవితాన్ని తలక్రిందులు చేసేసింది.క్షణం తీరిక లేకుండా గడిపేవారిని నాలుగు గోడల మధ్య బందీని చేసింది.

దీంతో చిన్నారుల నుంచి పెద్దల వరకు కబుర్లు, వంటలు, టీవీలు, లూడో, పచ్చీసులు, పేకాటలతో కాలక్షేపం చేశారు.ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు అన్ని పనుల్ని ఇంటి నుంచే చక్కదిద్దుకున్నారు.

అయితే ఈ సమయంలో ఒంటరిగా వుండేవారు నరకం అనుభవించారు.అందుకే బోర్ ఫీలింగ్ పొగొట్టుకునేందుకు చిరుతిళ్లు లాగించడం అలవాటు చేసుకున్నారు.

టీవీలు చూస్తూ, ఆడుకుంటూ, పనిచేస్తూ ఏదో ఒకటి తినేవారు.ప్రతి పది మంది భారతీయుల్లో 9 మంది స్నాక్స్ తెగ తినేశారని ఓ సర్వేలో తేలింది.

Advertisement

బోర్ ఫీలింగ్ పోయేందుకు దాదాపు 66 శాతం మంది భారతీయులు మీల్స్ కోసం స్నాక్స్ ఎక్కువగా తయారుచేసుకున్నారట.ఈ జాబితాలో ప్రపంచ స్థాయిలో పోలిస్తే మనమే ముందున్నాం.

మూడ్ మారేందుకు స్నాక్స్ తినడాన్ని ఎక్కువగా ఎంచుకున్నారట.దాదాపు మూడింట రెండింతల మంది భారతీయులు ఒంటరితనం నుంచి బయటపడేందుకు స్నాక్స్ తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించారట.

ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 6 నుంచి 20వ తేదివరకు 6,292 మందిపై మోండెలెజ్, ఇంటర్నేషనల్, ది హారిస్ పోల్ సంస్థలు గ్లోబల్ ఆన్ లైన్ సర్వే నిర్వహించాయి.అందులో భారతదేశంలోని 12 మార్కెట్లలో 508మందిపై కూడా సర్వే నిర్వహించారు.భారతీయులు ఎక్కువగా కొత్త వంటలు ట్రై చేయడం, బేకింగ్, స్నాక్స్ తయారుచేసుకుని తినడం చేశారట.

నెలల తరబడి లాక్ డౌన్ అమల్లో ఉండటంతో చాలామందిలో ఆహారపు అలవాట్లను మార్చేసింది.అయితే ఆహార విక్రయాలు మాత్రం పడిపోయాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

మార్కెట్‌ రీసర్చర్‌ నీల్సన్‌ అధ్యయనం ప్రకారం.ఈ ఏడాదిలో జూన్‌ త్రైమాసికంలో స్నాక్స్‌, పానియాల అమ్మకాలు 25శాతం పడిపోయాయి.సెప్టెంబరు త్రైమాసికంలో 6.9శాతం మేర తగ్గాయి.అన్‌లాక్‌ ప్రక్రియ మొదలైన తర్వాత.

Advertisement

ప్రజలు మళ్లీ బయట ఆహారంపై ఆసక్తి చూపారు.ప్యాకింగ్ స్నాకులను కొనుగోలు చేశారు.సర్వే ప్రకారం.10మందిలో 8 మంది లేదా 81శాతం మంది భారతీయులు పెద్ద మొత్తంలో భోజనాల కంటే స్నాక్స్ తినేందుకు ఎక్కువగా ఇష్టపడ్డారని తేలింది.మరోవైపు కరోనా మహమ్మారి కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం ద్వారా బిజినెస్ యాప్స్ మీద గత ఏడాది కంటే ఈ ఏడాది రెండు రెట్లు ఎక్కువ సమయాన్ని కేటాయించారట.

వ్యాక్సిన్లు త్వరలో రానున్నప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వచ్చే ఏడాది కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది.అందుకే వచ్చే ఏడాది 2021లో కూడా ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉంది.2020లో వినియోగదారులు ఇంటర్ నెట్‌లో ఎక్కువ గంటలు గడపడానికి మరిన్ని అంశాలు కూడా దోహదం చేశాయని అనలటిక్స్ సంస్థ అభిప్రాయపడింది.ఈ ఏడాది ఆండ్రాయిడ్ డౌన్‌లోడ్‌లు 10 శాతం పెరిగి 90 బిలియన్ల మార్కును దాటాయి.

గేమ్స్ కి సంబందించిన యాప్స్ డౌన్‌లోడింగ్‌లో 45 శాతం వాటాను ఆక్రమించుకున్నాయి.ఈ జాబితాలో భారత్, బ్రెజిల్, ఇండోనేషియా ప్రజలు ముందున్నారు.

తాజా వార్తలు