అన్నవరం ఆలయంలో కరోనా విజృంభణ

ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది.ఈ వైరస్ కారణంగా ఏపీలో చాల మంది ప్రాణాలను కోల్పోయారు.

ఈ మహమ్మారి బారినపడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది.ఒక్కరోజులోనే వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

ఈ మహమ్మారి బారి నుండి ప్రజలను కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటూనే ఉంది.ఇది ఇలా ఉండగా మరోవైపు పుణ్యక్షేత్రంలో కూడా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

ఇప్పటికే కరోనా కారణంగా చాల దేవాలయాలు మూతపడ్డాయి.తాజాగా తూర్పు గోదావరి జిల్లా అన్నవరం ఆలయంలో కూడా కరోనా కలకలం రేపుతుంది.

Advertisement

అన్నవరం శ్రీ వీర వెంక‌ట స‌త్య‌నారాయ‌ణ స్వామి వారి దేవస్థానంలో పనిచేసే అర్చకులకు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.ఈ నిర్దారణ పరీక్షల్లో 50 మందికి ఈ వైరస్ సోకినట్లు వెల్లడించారు.

కరోనా సోకిన వారందరు ఐసోలేషన్ ఉండి చికిత్స పొందుతున్నారు.సిబ్బందికి కరోనా నిర్దారణ అయినట్లు తెలియడంతో ఆలయ అధికారులు వెంటనే అప్రమత్తమైయ్యారు.

అంతేకాకుండా ఈ నెల 23 వరకు ఆలయాన్ని మూసివేస్తునట్లు ప్రకటించారు.ఆలయంలో జరగాల్సిన వ్ర‌తాలు, క‌ల్యాణం, చండీ, ఆయుష్య హోమాలు, త్రికాల పూజ‌ల‌న్నీ ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు ఆల‌య ఈవో త్రినాథ‌రావు వెల్లడించారు.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు