హెయిర్ ఫాల్‌కు చెక్ పెట్టే ధ‌నియాలు.. ఇలా వాడండి!

ధ‌నియాలు.అంద‌రి వంటింట్లో ఉండే మ‌సాల దినుసు ఇది.

వంట‌ల‌కు ప్ర‌త్యేక‌మైన రుచి, సువాస‌న అందించ‌డంలో ధ‌నియాలు కీల‌క పాత్ర‌ను పోషిస్తాయి.

అందుకే వీటిని రోజూవారీ వంట‌ల్లో విరివిరిగా ఉప‌యోగిస్తుంటారు.

అలాగే ధ‌నియాల్లో విట‌మిన్లు ఎ, విట‌మిన్ సి, విటమిన్ కె తో పాటు పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, శ‌క్తి వంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్క‌లంగా నిండి ఉంటాయి.అందుకే ఇవి ఆరోగ్య ప‌రంగా బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తాయి.

అలాగే జుట్టు సంర‌క్ష‌ణ‌కు కూడా ధ‌నియాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.ముఖ్యంగా హెయిర్ ఫాల్‌కు చెక్ పెట్ట‌డంలో ధ‌నియాలు గ్రేట్‌గా సహాయ‌ప‌డ‌తాయి.

Advertisement

మ‌రి ఇంత‌కీ వీటిని జుట్టుకు ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్‌లో ఐదు టేబుల్ స్పూన్ల ధ‌నియాలు, ఒక క‌ప్పు వాట‌ర్ పోసి గంట పాటు నాన‌బెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాట‌ర్ పోయాలి.వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో నాన‌బెట్టుకున్న ధ‌నియాల‌ను వేసి ఉడికించాలి.

ప‌దిహేను నిమిషాల అనంత‌రం స్ట‌వ్ ఆఫ్ చేసి ఉడికించుకున్న ధ‌నియాల‌ను చ‌ల్లార‌బెట్టుకోవాలి.బాగా కూల్ అయిన వెంట‌నే బ్లెండ‌ర్‌లో ఉడికించుకున్న ధ‌నియాల‌ను నీటితో స‌హా వేసేసి మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

ఆపై ఈ మిశ్ర‌మంలో రెండు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్‌, వ‌న్ టేబుల్ స్పూన్ పెరుగు, వ‌న్ టేబుల్ స్పూన్ కోక‌న‌ట్ ఆయిల్ వేసి అన్నీ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించి ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసుకోవాలి.గంట పాటు ఈ హెయిర్ ప్యాక్‌ను ఉంచుకుని.అప్పుడు మైల్డ్ షాంపూతో త‌ల‌స్నానం చేయాలి.

Advertisement

ఇలా వారానికి ఒక‌సారి చేస్తే జుట్టు కుదుళ్ల‌కు బ‌లంగా చేకూరి ఊడ‌టం త‌గ్గుతుంది.మ‌ర‌యు శిరోజాలు ఒత్తుగా కూడా పెరుగుతాయి.

.

తాజా వార్తలు