దుబ్బాకలో కాంగ్రెస్ టికెట్ ఫైట్.. ఎవరికి దక్కుతుందంటే..?

తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో దుబ్బాక ( Dubbaka ) నియోజకవర్గం రాజకీయంగా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.

నవంబర్ 30వ తేదీన ఎన్నికలు ఉన్న తరుణంలో అక్కడ రాజకీయ వేడి రాజుకుంది.

అధికార బీఆర్ఎస్, బిజెపి ,కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.ఇప్పటికే అక్కడ బిజెపి పార్టీ నాయకులు రఘునందన్ రావు ( Raghunandan rao ) ఎమ్మెల్యేగా ఉన్నారు.

ఇదే తరుణంలో త్వరలో ఎన్నికలు ఉన్న సందర్భంగా దుబ్బాక నియోజకవర్గంపై రాష్ట్రమంతా ఆసక్తి నెలకొంది.ఈసారి రఘునందన్ రావుని ఓడించేది బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కొత్త ప్రభాకర్ రెడ్డి అని కొంతమంది అంటే, కాదు కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓడిస్తారని కొంతమంది భావిస్తున్నారు.

ఇక గెలుపోటములు పక్కనబెడితే.దుబ్బాక కాంగ్రెస్ లో మాత్రం విపరీతమైనటువంటి టికెట్టు పోరు ఏర్పడిందట.అయితే దుబ్బాక నియోజకవర్గం గత కొన్ని పర్యాయాల నుంచి రెడ్డి సామాజిక వర్గమే పాలిస్తూ వస్తుండగా.

Advertisement

ఈసారి బీసీ వర్గానికి టికెట్ వస్తుందని కాంగ్రెస్ నాయకురాలు అయిన కత్తి కార్తీక ( Katti karthika ) భావిస్తుందట.లేదు లేదు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చెరుకు శ్రీనివాస్ రెడ్డికి టికెట్ వస్తుందని ఆయన వర్గీయులు అంటున్నారట.

అలాగే శ్రావణ్ కుమార్ రెడ్డి ( Sravan kumar reddy ) కి కూడా టికెట్ వస్తుందని మరో వర్గం భావిస్తోందట.ఈ విధంగా కాంగ్రెస్ నుంచి ముగ్గురు లీడర్లు మాకు టికెట్ వస్తుందంటే, మాకు టికెట్ వస్తుంది అంటూ ఎన్నికల ప్రచారంలో మాత్రం మునిగిపోయారట.

ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ త్రిముఖ టికెట్ పోటీలో ఎవరు గెలుస్తారో ఏమో కానీ, కార్యకర్తలు మాత్రం ఏ నాయకుడి వెంబడి ఉండాలో తెలియక సతమతమవుతున్నట్టు తెలుస్తోంది.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు