సుష్మా నటనలో దిట్ట

విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సినిమాల్లో నటిస్తున్నారా? లేక డ్రామాల్లో నటిస్తున్నారా? మనకు తెలిసినంతవరకూ ఆమె నటి కాదు.

కాని సుష్మా బాగా నటిస్తున్నారని కాంగ్రెస్స్ అధినేత్రి సోనియా గాంధి వ్యంగ్యంగా అన్నారు.

అవినీతి ఆరోపణలు రావడంతో విదేశాలకు పారిపోయిన లలిత్ మోడీ విషయంలో వీరి ఇద్దరి మధ్య పోరాటం జరుగుతున్న సంగతి తెలుసు.లలిత్ మోడీకి సహాయం చేసిన సుష్మా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న సోనియా పార్లమెంటు సమావేశాలను జరగనివ్వడంలేదు.

Sushma Expert At Theatrics-Sushma Expert At Theatrics-Telugu Political News-Telu

మోడీతో తనకు సంబంధం లేదని, తను ఆయనకు సాయం చేయలేదని చెప్పారు.మోడీ లండన్ నుంచి పోర్చుగల్ వెళ్లేందుకు తాను బ్రిటన్ ప్రభుత్వానికి సిఫార్సు చేయలేదన్నారు.

క్యాన్సర్తో బాధపడుతున్న మోడీ భార్య పట్ల మానవత్వంతో వ్యవహరించానని పార్లమెంటులో వివరణ ఇచ్చారు.దీన్నే నటన అంటారని సోనియా విమర్శించారు.

Advertisement

తల్లితో పాటు కుమారుడు రాహుల్ కూడా బాణాలు వేసారు.జైలుకు వెళ్ళకుండా తప్పించుకోవడానికి మోడీ సుష్మా కుటుంబానికి ఎంత డబ్బు ఇచ్చారని ప్రశ్నించారు.

మొత్తమ్మీద తల్లి, కొడుకు భాజపా సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు