నేతన్నల బతుకులు ఆగం అయ్యేలా కాంగ్రెస్ విధానాలు..: కేటీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) బహిరంగ లేఖ రాశారు.

నేతన్నల బతుకులు ఆగం అయ్యేలా కాంగ్రెస్ విధానాలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) నేతన్నలకు ఆర్డర్లు ఆపేసిందన్న కేటీఆర్ గతంలో మాదిరిగానే నేతన్నలకు చేతినిండా ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బతుకమ్మ చీరల ఆర్డర్లు( Bathukamma Sarees Orders ) ఇవ్వడంతో పాటు ఎన్నికల కోడ్ వలన ఆపేసిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.ఈ క్రమంలోనే వస్త్ర పరిశ్రమను ఆదుకోకపోతే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదని తెలిపారు.అదేవిధంగా టెస్లా కంపెనీని తెలంగాణకు తెచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలని వెల్లడించారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు