అక్కినేని నాగార్జున( Nagarjuna ) అంటే ఎవరో తెలియనివారు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఉండరనే చెప్పుకోవాలి.అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తండ్రి బాటలో కాకుండా తనదైన రీతిలో వరుసగా సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో మంచి స్థాయికి వచ్చారు.
ఈ క్రమంలోనే నాగార్జున చేసిన శివ, గీతాంజలి, అన్నమయ్య సినిమాలు అశేష జనాలను అమితంగా ఆకట్టుకున్నాయి.ఈ సినిమాలు అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించాయి.
ఇక ఏ జానర్లో అయిన సినిమాలు చేసి మెప్పించగలిగే సత్తా ఉన్నటువంటి అరుదయిన నటులలో నాగార్జున కూడా ఒకరు.ప్రస్తుతం ఆయన వరుస సినిమాలని లైన్లో పెడుతూ కొత్త కొత్త కథలను వింటూ దర్శకులను ఎంపిక చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది.
ఈ మధ్యనే అన్నపూర్ణ స్టూడియోస్ తన ఇన్స్టా వేదికగా రచయితలను కధలు కావాలని కోరింది.
ఇదిలా ఉండగా నాగార్జున ఒకప్పుడు సౌందర్య,( Soundarya ) రమ్యకృష్ణ( Ramyakrishna ) లాంటి హీరోయిన్లతో ఎక్కువగా సినిమాలు చేసేవాడు.ఆ సమయంలో మీనా, రంభ లాంటి అందమైన హీరోయిన్లు ఉన్నప్పటికీ వాళ్ళని తన సినిమాలో ఎక్కువగా రిపీట్ చేయడానికి మక్కువ చూపేవారు కాదట.అదే సౌందర్య, రమ్యకృష్ణతో మాత్రం తను ఎక్కువగా సినిమాలు చేస్తూ వచ్చాడు.
రీసెంట్ గా నాగార్జునని ఒక ఇంటర్వ్యూలో ఈ విషయానికి సంబంధించిన ప్రశ్న అడగగా ఆయన దానికి సమాధానం చెబుతూ నాతో సినిమా చేసే దర్శకులు సౌందర్య, రమ్యకృష్ణ పేర్లను నా దగ్గర ఎక్కువగా ప్రస్తావించేవారు.అందుకే వారిని తన సినిమాలో ఎక్కువగా రిపీట్ చేస్తూ వచ్చాను అని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మా కెమిస్ట్రీ కూడా అప్పట్లో చాలా బాగా వర్క్ అవుట్ అయ్యేదనే ఉద్దేశ్యంతో దర్శకులు ఆ హీరోయిన్లతోనే సినిమాలు చేయాలని కోరేవారు.అలా వాళ్ళు లైన్లోకి వచ్చేవారు.ఇక అందరూ అనుకున్నట్టుగానే వారి కాంబినేషన్లో వచ్చిన చాలా సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ అవడం ప్రేక్షకులకు బాగా తెలుసు.ఓ విధంగా ప్రేక్షకులు కూడా వారిని స్క్రీన్ మీద చూసి బాగా ఎంజాయ్ చేసేవారు.
అందుకే హీరో నాగార్జున వారిని ఎక్కువగా రిపీట్ చేసేవారు.ఇక అదే కోవకి చెందుతారు.
హీరోయిన్ టబు.( Heroine Tabu ) టబుతో కూడా నాగార్జున వరుసగా రెండు మూడు సినిమాలు చేస్తే అవి బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ సక్సెస్ అయ్యాయి.