అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి జనసేన అభ్యర్థి పేరు ఖరారు అయింది.ఈ మేరకు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్( Mandali Buddha Prasad ) పేరును ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ఖరారు చేశారు.
ఈ క్రమంలోనే రైల్వేకోడూరు అభ్యర్థి యనమల భాస్కర్ రావు( Yanamala Bhaskar Rao )ను మార్చాలని జనసేనాని పవన్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.అయితే రైల్వేకోడూరు అభ్యర్థిపై పార్టీలో ఏకాభిప్రాయం రాలేదని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నట్లు తెలుస్తోంది.పాలకొండ, రైల్వేకోడూరు అభ్యర్థులపై త్వరలో నిర్ణయం ఉంటుందని జనసేన వెల్లడించింది.