తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ఏర్పడినట్లుగా ఉందని అనుకుంటున్నారట కొందరు నేతలు.దీనికి కారణం ఇప్పటి వరకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన రాజకీయ ప్రణాళికను ప్రకటించక పోవడమే.
ఈ విషయాన్ని పరిశీలిస్తే ఈటల తన రాజకీయ జీవితానికి గట్టి పునాదులు వేసుకునే దిశగా పావులు కదుపుతున్నారేమో అనే అనుమానాలు మొదలైయ్యాయట.ఇక తాను మంత్రి పదవి నుండి బర్తఫ్ అయిన తర్వాత కాంగ్రేస్ లోకి వెళ్లడమా బీజేపీలో చేరడమా, లేదా టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్న నాయకులతో కొత్త పార్టీ తెలంగాణలో స్దాపించడమా అనే డైలామాలో ఉన్నట్టుగా ప్రచారం జరిగింది.
కానీ అనుహ్యంగా ఈటల బీజేపీలో చేరుతున్నారనే వార్త జోరుగా ప్రచారంలోకి వచ్చింది.ఈ నేపధ్యం లో పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈటలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో ఇంత గలిజు రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని, ఎవరు అధికారంలో ఉంటే అటు పోవడం నాయకులకు అలవాటు అయ్యిందని ఫైర్ అయ్యారు.అయినా అందరు మీలాగా ఉండాలి కదా సారు.
ఇప్పుడు గనుక ఈటల రాజకీయ జీవితాన్ని సరైన గాడిలో పడవేయకుంటే చిక్కుల్లో పడటం ఖాయం.అందుకే కావచ్చూ కేంద్రంతో కలిస్తే గులాభినేత ఆటలు కట్టేయవచ్చని ఆలోచిస్తున్నాడు అని అంటున్నారట రాష్ట్ర రాజకీయాలను గమనిస్తున్న వారు.