నభూతో అన్న రీతిలో కొల్లాపూర్ సభ?

కర్ణాటక ( Karnataka )ఫలితాలతో కొత్త ఉత్సాహంతో ఎన్నికలకు సిద్ధమైన తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) ఖమ్మం సభతో సూపర్ సక్సెస్ కొట్టింది .

జిల్లా మొత్తాన్ని ప్రభావితం చేయగలిగే కలిగిన కీలక నేత పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి( Pongileti Srinivas Reddy ) చేరికతో తెలంగాణ కాంగ్రెస్ బలం మరింత పెరిగింది అని చెప్పవచ్చు .

నాయకులందరూ ఐకమత్యంగా కనిపించడం, కీలక నేతలు నాయకుల్ని తిరిగి పునరేకికరణ చేయగలగటం, హై కమాండ్ కూడా తెలంగాణ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టి భారీ బహిరంగ సభ సభలు ఏర్పాటు చేయడం వంటి సంఘటనలతో కాంగ్రెస్కు కు వరుసగా పాజిటివ్ వేవ్ పెరుగుతుంది.

ఇప్పుడు మహబూబ్నగర్ వేదికగా కొల్లాపూర్ లో ఈనెల 20వ తారీఖున 10 లక్షల మందితో నభూతో అన్న రీతిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ శరవేగం గా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది .బారాస బహిస్కృత నేత జూపల్లి కృష్ణారావుతో పాటు కూచుకుట్ల దామోదర్ రెడ్డి( Kuchukutla Damodar Reddy ) ఆయన కుమారుడు రాజేష్ రెడ్డి మరికొందరు కీలక నేతలను ఆ సభ వేదికగా పార్టీల్లోకి చేర్చుకోవడానికి రంగం సిద్ధమైందని, అంతేకాకుండా ఖమ్మం సభలో 4 వేల రూపాయల పెన్షన్ స్కీం కి అద్భుతమైన స్పందన వచ్చినందున ,అలాంటి మరిన్ని పథకాలను మహబూబ్నగర్ సభ సాక్షిగా ప్రియాంక గాంధీ ( Priyanka Gandhi )చేత ప్రకటింప చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రణాళికలు రచించుకుంటున్నారట.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో విజయవంతమైన హామీలైన 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కానీ లేకపోతే మహిళలకు ఉచిత రవాణా సదుపాయం లాంటి భారీ స్కీమ్ ని ప్రియాంక చేత ప్రకటిస్తే అది తెలంగాణలో మహిళ ఓటర్లను విశేషంగా ఆకట్టుకునే అవకాశం ఉందని భావిస్తున్న కాంగ్రెస్ ఆ దిశగా కీలకమైన ఏదైనా ఒక పథకాన్ని ప్రకటింప చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది .ఖమ్మం జిల్లాతో సభతో మొదలుపెట్టి ప్రతి 15 రోజులకు ఒకసారి భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ని వదిలిపెట్టి వెళ్లిన కీలక నేతలను పూర్తిగా కాంగ్రెస్ వైపు ఆకర్షించాలని, పార్టీ ఏఏ వర్గాలలో బలహీనంగా ఉందో గుర్తించి బలం పెంచుకునే వ్యూహాలను అవలంబించాలని ఎన్నికలు సమయం వరకు అలుపెరగకుండా కృషి చేయాలని ఒక పట్టుదలతో కాంగ్రెస్ నాయకులు పని చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

Advertisement
స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!

తాజా వార్తలు