ఈమధ్య కాలం లో హంగులు ఆర్భాటాలతో విడుదల అవుతున్న సినిమాలకంటే కూడా, ఎలాంటి అంచనాలు లేకుండా అతి చిన్న సినిమాలుగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న సినిమాలే ఎక్కువ అవుతున్నాయి.ఒక విధంగా చెప్పాలంటే ఈ ఏడాది సమ్మర్ ని కాపాడింది చిన్న సినిమాలే.
ఇక రీసెంట్ సమయం లో ‘ప్రభాస్‘ హీరో గా నటించిన ఆదిపురుష్( Adipurush ) చిత్రం వల్ల బయ్యర్స్ భారీగా నష్టపోయారు.ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇప్పట్లో కోలుకోలేని రేంజ్ దెబ్బ తగిలింది.
అలాంటి సమయం లో వారికి రీసెంట్ గా విడుదలైన ‘సామజవరగమనా( Samajavaragaman )’ అనే చిన్న చిత్రం,జరిగిన నష్టం లో కాస్తో కూస్తో పూడ్చేలా చేసింది.కేవలం మూడు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం పది రోజులకు గాను 11 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది.
అంటే బయ్యర్స్ కి 7 కోట్ల రూపాయిల లాభాలు కేవలం పది రోజుల్లోనే వచ్చింది అన్నమాట.

ఇక ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా పెద్ద ప్రభంజనం సృష్టించింది అనే చెప్పాలి , అక్కడ ఈ చిత్రానికి 8 లక్షల డాలర్లు వచ్చాయి.ఈ వీకెండ్ కూడా డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉండడం తో ఫుల్ రన్ లో ఈ చిత్రం కేవలం అమెరికా నుండే 1 మిలియన్ డాలర్లు రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు.ఇకపోతే ఓటీటీ కి బాగా అలవాటు పడిన ఆడియన్స్ కి ఇలాంటి చిన్న సినిమాలను థియేటర్స్ లో చూసేందుకు కంటే ఎక్కువగా ఓటీటీ లో చూసేందుకే ఎక్కువగా ఇష్టపడుతారు.
అలాంటి ఆడియన్స్ కోసం ఇప్పుడు ఒక శుభవార్త.ఈ సినిమాని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది.ఈ నెల 22 కానీ లేదా 25 వ తేదీ కానీ ఈ సినిమాని ఓటీటీ లో విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

థియేటర్స్ లో ఈ రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంటున్న ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ ని కూడా అదే రేంజ్ లో మెప్పిస్తుందో లేదో చూడాలి.ఇక ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే.ఆయన రీసెంట్ గానే అక్కినేని అఖిల్ తో ‘ఏజెంట్( Agent )’ చిత్రాన్ని నిర్మించి భారీ గా నష్టపోయాడు.
సుమారుగా 50 కోట్ల రూపాయిల నష్టం ఈ సినిమా ద్వారా కలిగింది.ఇప్పుడు ‘సామజవరగమనా’ చిత్రం ఫుల్ రన్ లో 15 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసే అవకాశం ఉండడం తో ఏజెంట్ వల్ల వచ్చిన నష్టం లో 15 కోట్ల రూపాయిలు పూడడం తో పాటుగా, ఓటీటీ ద్వారా అదనంగా మరో పది కోట్ల రూపాయిల లాభం కూడా పూడనుండి.
ఇక ఈ సినిమా తర్వాత ఆయన మెగాస్టార్ చిరంజీవి తో ‘భోళా శంకర్’ అనే చిత్రాన్ని నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే.వచ్చే నెల 11 వ తారీఖున విడుదల కాబోతుంది ఈ సినిమా.







