వారిపై భారీగానే ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ 

ఏపీలో రాజకీయ చిత్రం ఏ క్షణంలో ఎలా ఉంటుందో ఎవరికి అర్థం కావడం లేదు.ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి వలసలు జోరెందుకున్నాయి.

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా టిడిపి , జనసేనలు( TDP, Janasena ) పొత్తు పెట్టుకోగా , బిజెపి కూడా ఆ రెండు పార్టీలతో జత కలిసే అవకాశం కనిపిస్తుంది.ఇక అధికార పార్టీ వైసీపీ( ycp ) ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొంటామని ప్రకటించింది.

  అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ జగన్ మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు.ఆ పార్టీలు టికెట్లు దక్కని నేతలంతా ఇప్పుడు ప్రత్యామ్నాయం చూసుకుంటూ ఉండడంతో , పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి వలసలు ఉంటాయని ఆ పార్టీ భావిస్తోంది.

ఇప్పటికే కొంతమంది కీలక నాయకులు తమతో టచ్ లో ఉన్నారని,  కాంగ్రెస్ లో చేరేందుకు వైసీపీకి చెందిన కీలక నేతలు ఎంతోమంది సంప్రదింపులు చేస్తున్నట్లుగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్ర రాజు( Gidugu rudraraju ) చెబుతున్నారు.

Advertisement

ఇక టిడిపి , జనసేన లు తమ అభ్యర్థులను ప్రకటిస్తే,  ఆ పార్టీలో టికెట్ దక్కని వారు కాంగ్రెస్ లో చేరుతారని ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది.ఈ సంక్రాంతి పండుగ తర్వాత భారీగా కాంగ్రెస్ లోకి చేరికలు ఉంటాయని,  గిడుగు రుద్ర రాజు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే కొంతమంది అసంతృప్త నాయకులను గుర్తించి కాంగ్రెస్ సంప్రదింపులు చేస్తుంది.

రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసి,  వీలైనంత ఎక్కువ సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ఉంది.సిపిఐ,  సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీతోనూ( CPI, CPM , Aam Aadmi Party ) పొత్తు పెట్టుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా గిడుగు రుద్దరాజు చెబుతున్నారు.

ఆ పొత్తులు కుదిరితే సీట్ల సర్దుబాటు ఈనెల 17 నుంచి ప్రారంభిస్తామని ఆయన చెబుతున్నారు .

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే భారీగా చేరికలు ఉంటాయని,  ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభావం పెరుగుతుందని ఆ పార్టీ అంచనా వేసుకుంటోంది.ఇప్పటికే షర్మిల తోటే తన రాజకీయ ప్రయాణం అని  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.  మరి కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు  సిద్ధమవుతున్నారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

షర్మిలకు కీలక బాధ్యతలను అప్పగిస్తే వలసలు జోరు అందుకుంటాయని కాంగ్రెస్ కొండంత అండతో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు