పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ బూత్ లెవల్ మీటింగ్

పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ బూత్ లెవల్ మీటింగ్( Congress Booth Level Meeting ) జరగనుంది.

హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు.

రేపు జరగనున్న బూత్ లెవల్ మీటింగ్ పై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది.ఈ నేపథ్యంలోనే సమావేశం ఏర్పాట్లపై గాంధీభవన్ లో నేతలు చర్చిస్తున్నారు.

ఈ మేరకు హైదరాబాద్ ముఖ్యనేతలతో ఇంఛార్జ్ దీపదాస్ మున్షీ( Deepa Dasmunshi ) భేటీ అయ్యారు.సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.కాగా బూత్ లెవల్ మీటింగ్ కు సుమారు 35 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు