ఎమ్మెల్యే మేనల్లుడి తలకి 51 లక్షల రివార్డు.

సోషల్ మీడియాలో ఉన్న యువత బాధ్యతగా మెలగాలి లేకుంటే ఏమవుతుందో కర్ణాటకలో జరిగిన సంఘటన చూస్తే తెలుస్తుంది.

అసలు ఈ సంఘటన ఎలా జరిగింది దానికి కారణాలు ఏంటి ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం కాంగ్రెస్ నుండి  ఎమ్మెల్యేగా కొనసాగుతున్న అఖండ శ్రీనివాస మూర్తి మేనల్లుడు నవీన్ ముస్లింలకు సంబంధించిన ప్రవక్త గురించి కొన్ని తప్పుగా ఉన్న ఫోటోలను షేర్ చేశాడు.దానితో కోపోద్రిక్తులైన ముస్లింలు వెంటనే ఎమ్మెల్యే ఇంటిపై అర్థరాత్రి దాడి చేశారు.

విషయం వెంటనే సీరియస్ అవ్వడంతో వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.ఇలా తన ఇంటిపై దాడి చేయడానికి వచ్చిన వారిలో కొందరు తన ఇంటిని తగలపేట్టేందుకు పెట్రోల్ బాంబ్ లు విసిరారని శ్రీనివాస మూర్తి ఆరోపణలు చేస్తున్నారు.

ఇక నిజానిజాలు విచారణలో తేలాల్సి ఉంది.ఇంతటి దారుణానికి కారణమైనది ఎమ్మెల్యే మేనల్లుడు నవీన్ అని అతడిని పట్టిస్తే వారికి 51 లక్షలు ఇస్తానని ఉత్తరప్రదేశ్ కి చెందిన మీరట్ లోని ఓ ముస్లిం నేత ప్రకటించాడు.

Advertisement

విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నా ఆ ముస్లిం నేత వ్యాఖ్యలపై త్వరలోనే పోలీసులు స్పందించే అవకాశం ఉంది.ఈ ఘటనపై స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా రాష్ట్రంలోని యువత సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా మెలగాలని ఓ పిలుపు ఇచ్చారు.

పరీక్షకు నిమిషాల ముందు షాక్.. హాల్ టికెట్ తన్నుకుపోయిన గద్ద.. చివరి క్షణంలో ఏమైందంటే..?
Advertisement

తాజా వార్తలు