తెలంగాణ హోంమంత్రి ఇంట్లోకి దూసుకెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు !

తెలంగాణ రాష్ట్రం లో మహిళలపై జరిగే అత్యాచారాలు, హత్యలపై కాంగ్రెస్ నిరసన వ్యక్తం హోంమంత్రి ఇంటిని ముట్టడించారు.

ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

హోంమంత్రి ఇంట్లోకి చొరబడేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా ప్రయత్నించారు.మినిస్టర్ క్వార్టర్స్ గేట్స్ ను తన్నుకొని లోపలికి చొరబడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేసారు.

హోమ్ మంత్రి ఇంట్లోకి కూడా వారు చొరబడేందుకు ప్రయత్నించగా , అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది.అయితే , ఆ సెక్యూర్టీ గార్డ్స్ లు అడ్డుకున్నా.

వారిని తోసుకుంటూ కొందరు లోపలికి వెళ్లిపోయారు.మిగిలిన వారు అక్కడే బైఠాయించి ధర్నా చేపట్టారు.

Advertisement

దీనితో రంగంలోకి దిగిన పోలీసులు.కార్యకర్తలను, నేతలను అడ్డుకున్నారు.

ఈ క్రమంలో హోం మంత్రి ఇంటి వద్ద సెక్యూరిటీని పెంచారు.పెద్దఎత్తున పోలీసు బలగాలు క్వార్టర్స్ దగ్గరికి చేరుకుంటున్నాయి.

ఈ నిరసన కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ పాల్గొన్నారు.ఇక ఖమ్మంలో మృగాళ్ల పాశవిక దాడిలో చికిత్స పొందుతున్న బాలికకు మెరుగైన వైద్యాన్ని అందించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.

బన్నీని ఆ రిక్వెస్ట్ చేసిన డేవిడ్ వార్నర్... ఓకే చెప్పిన అల్లు అర్జున్?
Advertisement

తాజా వార్తలు