రామ్ చరణ్ పై ఫిర్యాదులు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రూజెట్ అనే విమాన సర్వీసుల సంస్థలో భాగస్వామి అన్న విషయం తెలిసిందే.

ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం, డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నివేదిక ప్రకారం ఆగస్టులో 5 శాతం కంటే ఎక్కువ విమానాలను రద్దు చేసిన విమాన సంస్థల్లో ఎయిర్ పెగాసస్, ట్రూజెట్ టాప్ లో ఉన్నాయి.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రయాణికుల నుంచి వచ్చిన ఫిర్యాదులు కూడా ట్రూజెట్ పైనే ఎక్కువగా ఉన్నాయి.దాంతో ప్రయాణికులు పదే పదే ఫిర్యాదులు చేస్తున్నారట.

రామ్ చరణ్ ను ఉద్దేశించి కుడా చాలా మెయిల్స్ వస్తున్నాయట.మొన్నంటే మొన్న, గురువారం రాత్రి ట్రూజెట్ ఫ్లయిట్ 2T 106 ఔరంగాబాద్-హైదరాబాద్-తిరుపతి సర్వీసును హైదరాబాద్ వచ్చిన తర్వాత రద్దు చేశారు.

దీంతో ప్రయాణికులు నిరసన వ్యక్తం చేశారు.అయినా సంస్థ అధికారులు పట్టించుకోలేదట.

Advertisement

ఎంత సేపు సినిమాలే కాకుండా ఈ సైడ్ బిజినెస్ ని కుడా రామ్ చరణ్ కాస్త పట్టించుకుంటే బాగుంటుందేమో.

కాశ్మీర్ వేర్పాటువాద జెండాలను అనుమతించొద్దు : రట్జర్స్ వర్సిటీకి ప్రవాస భారతీయ సంఘాల విజ్ఞప్తి
Advertisement

తాజా వార్తలు