కలర్ ఫోటో సినిమాలో కలర్ తక్కువైందా..?

కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల సినిమాలను ఎక్కువగా ఇష్టపడే ప్రేక్షకులు వినోదం కోసం ఓటీటీలపై ఆధారపడుతున్నారు. అమెజాన్ ప్రైమ్.

నెట్ ఫ్లిక్స్, ఆహా, హాట్ స్టార్ లాంటి ఓటీటీ ఫ్లాట్ ఫాంల ద్వారా కొత్త సినిమాలను వీక్షిస్తున్నారు.ఓటీటీ ద్వారా ఇప్పటికే వి, నిశ్శబ్దం, ఒరేయ్ బుజ్జిగా లాంటి సినిమాలు విడుదల కాగా ఈ సినిమాలలో ఏ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కాలేదు.

నిన్న ఆహా ఓటీటీ వేదికగా దసరా పండుగ కానుకగా కలర్ ఫోటో అనే సినిమా విడుదలైంది.సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం నుంచే ఉన్నా సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న సుహాస్, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పరిచయమే హీరోయిన్ గా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న చాందినీ చౌదరి ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగానటించారు.

కమెడియన్ కమ్ క్యారక్టర్ ఆర్టిస్ట్ సునీల్ ఈ సినిమాలో విలన్ రోల్ లో హీరోయిన్ అన్న పాత్రలో నటించారు.ఈ సినిమా కథ, కథనాల పరంగా బాగానే ఉన్నా కలర్ ఫోటోలో కలర్ తక్కువైందంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

హీరో కలర్ ను బేస్ చేసుకుని సాగే ఈ కథలో రొటీన్ కథనే ఎంచుకున్నా హృద్యంగానే అనిపించే ఎన్నో సన్నివేశాలు ఉన్నాయి.క్లైమాక్స్ మరో విధంగా ఉంటే మాత్రం ఓటీటీలో విడుదలైన తొలి హిట్ గా కలర్ ఫోటో నిలిచి ఉండేది.

సుహాస్, చాందినీ చౌదరిలకు హీరోహీరోయిన్లుగా సినిమా మంచిపేరే తెచ్చిపెట్టినా సినిమా ప్రేక్షకులకు నచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.సునీల్ పోషించిన పాత్ర ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.

ఈ సినిమాకు కాల భైరవ సంగీతం ప్లస్ అయింది.సినిమాలో పాటలు, నేపథ్య సంగీతం సరిగ్గా కుదిరాయి.

సినిమాలో డ్రామా ఎక్కువైందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఈ మధ్య కాలంలో విడుదలైన ఓటీటీ సినిమాల్లాగే కలర్ ఫోటో కూడా నెగిటివ్ ఫలితాన్ని అందుకోవడం గమనార్హం.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు